Preparation of the balance sheet

Preparation of the Balance Sheet, monthly balance sheet, balance sheet maintain

Preparation of the Balance Sheet, monthly balance sheet, balance sheet maintain

మీ ఇంటికో బ్యాలెన్స్‌షీట్

Posted: 11/23/2013 06:18 PM IST
Preparation of the balance sheet

ఒక కంపెనీ లాభనష్టాల లెక్కల్ని తేల్చేందుకు పనికొస్తుంది 'బ్యాలెన్స్‌షీట్'. దీన్నే మన ఇంటికీ వర్తింవజేస్తే - నెల నెలా వస్తున్నదెంత, పోతున్నదెంత? లెక్క తేలుతుంది. ఇంటి బడ్జెట్ నిర్వహణ మీద పట్టు ఏర్పడుతుంది. లేదంటే - బడ్జెట్ బండి కుంటుపడటం ఖాయం. అప్పుడు చేతులు ఆడవు. అప్పులు పెరిగిపోయి మళ్లీ వచ్చే నెలకు అవే తిప్పలు పునరావృతం అవుతాయి. దీన్ని సరిదిద్దడానికి జమా ఖర్చుల లెక్కల జాబితాను రూపొందించడం తెలివైన మార్గం. నెలకు మీకొస్తున్న సంపాదన ఎంత? దేనికి ఎంత ఖర్చు అవుతోంది? చేస్తున్న పొదుపు ఎంత? బీమా ప్రీమియం చెల్లింపు, రుణ వాయిదాలు, అద్దె, ఇంటి సరుకులు, పాలు, స్కూలు ఫీజులు, పెట్రోలు, వైద్య ఖర్చు, కాలక్షేపానికి వెచ్చించే మొత్తం.. అత్యవసరాలకు అయ్యే ఖర్చు.. అన్నీ ఒక కాగితంలో రాసుకోండి.

ఇవన్నీ సరిచూసుకున్నాక.. ఎక్కడ అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది. దాన్ని వెంటనే సరిదిద్దండి. మీకు వస్తున్న ఆదాయానికి మించి మీరు ఖర్చు పెడుతుంటే ఆ విషయమూ అర్థం అవుతుంది. మీకొస్తున్న ఆదాయాన్ని బట్టి సరిపెట్టుకునే లక్షణం అలవడుతుంది. లేనిపోనివి కొనాలన్న ఆశ తగ్గిపోతుంది. కాబట్టి వెంటనే మీ ఇంటి బడ్జెట్‌కు బ్యాలెన్స్‌షీట్‌ను రూపొందించడం మరువొద్దు. ఈ పద్ధతినే ఒక అలవాటుగా మార్చుకుంటే మంచిది. అదే మీ పిల్లలకూ అలవడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Gold loan is better than personal loan

    పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోనే ఎంతో శ్రేయస్కరం!

    Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more

  • Credit cards using tips

    క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగిస్తున్నారు..?

    Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more

  • Financial tips to save money

    ఆర్థికంగా వృద్ధి చెందాలంటే.. ఖర్చులు అదుపులో వుంచాలి!

    Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం.  ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more

  • Tips to save money for better future

    ఉజ్వల భవిష్యత్ కోసం.. ఇఫ్పుడే ప్రణాళికలు చేసుకోండి!

    Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more

  • Tips to save salary money

    మీ కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నారా?

    Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు.  అయితే వీరు చాలా విషయాలలో... Read more