the best healthy foods which helps for deep sleep happily without any problems | foods for sleep | sleeping foods

Best healthy foods which helps for deep sleep happily

foods for sleep, sleeping foods, healthy foods, sleepy foods, healthy food items, deep sleep foods, healthy food packs, foods for health, home remedies, remedies for sleep

best healthy foods which helps for deep sleep happily : the best healthy foods which helps for deep sleep happily without any problems.

గాఢ నిద్రకు ఉపక్రమించాలంటే.. ఈ టిప్స్ పాటించండి!

Posted: 11/21/2015 01:09 PM IST
Best healthy foods which helps for deep sleep happily

నేటి ఫాస్ట్ జనరేషన్ లో ప్రతిఒక్కరు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఆఫీసు ఒత్తిడి కారణంగా గంటల తరబడి పనిలోనే నిమగ్నమవ్వడమే అందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. పైగా.. సామాజిక మాధ్యమాల వాడకం మరింత తీవ్రం కావడంతో.. నిద్రపోవడం మానేసి వాటిపైనే దృష్టి సారిస్తున్నారని ఓ పరిశోధనలో వెల్లడైంది. అంటే.. సోషల్ మీడియా వెబ్ సైట్స్ కూడా నిద్రలేమికి కారణాలవుతున్నాయి. మరికొందరైతే సహజంగా నిద్రపోరు. రాత్రి ఎంత సమయం అయినా.. నిద్ర రావడం లేదంటూ ఆవేదన చెందుతుంటారు. నిద్రమాత్రలు వేసుకున్నప్పటికీ ఆ సమస్య వారిని అంత త్వరగా విడిచిపెట్టదు. మరి.. అలాంటప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా నిద్రపోవాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

* పాలు, పెరుగుల్లో ‘ట్రిప్టోఫాన్’ అనే అమీనో యాసిడ్ వుంటుంది. అది త్వరగా నిద్రలో జారుకునేందుకు ప్రేరేపిస్తుంది. ఈ అమీనో యాసిడ్ బాడీ క్లాక్ పనితీరును క్రమబద్ధీకరించే సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా కంటి నిండా నిద్ర పడుతుంది. కాబట్టి.. రెగ్యులర్ గా పాలు, పెరుగు తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.
* ఫ్లాక్స్ విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో పుష్కలంగా నిల్వవుంటాయి. అవి.. ఆందోళన, ఒత్తిడి, నిరాశల తీవ్రతను తగ్గించి వాటి వల్ల తలెత్తే ఇన్‌సోమ్నియా (నిద్రలేమి)ని పోగొడతాయి. తద్వారా త్వరగా నిద్రకు ఉపక్రమించవచ్చు.
* అరటి పళ్లల్లో మెగ్నీషియం, పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి వేళ కండరాల నొప్పులు తలెత్తకుండా చేస్తాయి.
* ఓట్స్‌లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. నిద్రకు ముందు గోరువెచ్చని ఓట్స్ వంటకం తింటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
* బార్లీ గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదులో తీసుకున్నా నిద్ర పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : foods for sleep  healthy food items  deep sleep remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more