ఉద్యోగాలను సంపాదించుకోవడం కోసం ప్రస్తుతకాలంలో యువతీయువకులు ఎన్నోరకాల ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. అందులో కొంతమందికి తొందరగా జాబ్ లభిస్తే.. మరికొంతమందికి అస్సలు దొరకదు. అటువంటి తరుణంలో జాబ్ సంపాదించడానికి ముఖ్యమైన అంశాలగురించి తెలుసుకోవడం ఎంతో ఉత్తమం.
జాబ్ అనేది కేవలం మన చదువులనుగాని, హుందాతనాన్ని బట్టి కాని వరించదు. జాబ్ పొందడం కోసం ప్రత్యేకంగా డబ్బులను వెచ్చించి క్లాసులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అది మన ప్రగతి, ప్రతిభ, నైపుణ్యం, అందం, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి వుంటుంది.
ఇటువంటి స్కిల్స్ లో చాలామంది పొరపాటు పడుతుంటారు. జాబ్ సంపాదించుకునే ప్రయత్నంలో ప్రతిఒక్కరు తమ నైపుణ్యాన్ని, ప్రతిభను చూపిస్తారు. అయినప్పటికీ వారికి జాబ్ లభించదరు. మరికొందరు చూడ్డానికి అందంగా, మంచి నైపుణ్యం, ప్రతిభ వున్నప్పటికీ కూడా జాబ్ లభించదు. ఇటువంటివారిలో చాలావరకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ చాలా తక్కువగా వుంటాయి.
జాబ్ సంపాదించుకోవడం అనేది కేవలం ఒక్క అంశం మీదనే కాదు... అన్నిఅంశాలలో పాస్ అయినప్పుడే మనం ముందుకు సాగగల్గుతాం. ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని ప్రోత్సాహాన్ని పొందుతాం.
కొన్ని సూచనలు....
మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి హాజరువుతున్నారు అంటే ముందు మీ అప్పియరెన్స్ బాగుండాలి. చూడ్డానికి అందంగా కనిపించినప్పుడు మనలో వున్న డిసిప్లైన్ ని వారు గ్రహించగలరు. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అయితే కేవలం అందం ఒక్కటే సరిపోదు.. మీరు ఎంచుకున్న ఉద్యోగానికి తగిన నైపుణ్యాలను కలిగి వుండాలి. దానికి సంబంధించి అన్నివిధాల జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే జాబ్ లభించే అవకాశం వుంటుంది.
కొంతమంది ఇలా మన అప్పియరెన్స్ ఒక మోస్తరు మంచి మార్కులే వేస్తే.. మరికొన్ని ఆఫీసులలో దీనికి భిన్నంగా వుంటుంది. మన అప్పియరెన్స్ తో పాటు నలుగరిలో కలిసిపోయే స్వభావాన్ని కలిగి వుండాలి. మనం మాట్లాడే విధానం సూటిగా వుంటూ వారిని ఆహ్లాదపరిచేదిగా వుండాలి. దానికితగ్గ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోగలిగితే.. సింపుల్ గా జాబ్ మీ జేబులో వున్నట్టే లెక్క.
ఏదైనా ఒక రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే ముందుగా దానికి కావలసిన అర్హతలన్నీ వివరంగా తెలుసుకోవాలి. అందులో మొత్తం కాకపోయినా.. కాస్త అవగాహన అనేది మనకు చాలా ముఖ్యం. ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ముందు.. మీకు మీరు పరీక్షించుకుని చూడండి. మీలోని స్వభావాలను వ్యక్తపరుచుకోండి. మీలో వున్న వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకోండి. మీలో జాబ్ పొందడానికి నిర్ణీత అర్హతలు వున్నాయని భావిస్తే చాలు... సంపూర్ణ విశ్వాసంతో మీరు ముందడుగు వేయొచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ టీనేజ్. ఈ యుక్తవయస్సులో భవిష్యత్తు కార్యాచరణకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించుకోవచ్చు. విందు - వినోదాలతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా వుండే ఈ వయస్సు... ప్రతి... Read more
May 06 | ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను... Read more
Apr 24 | ప్రస్తుతకాలంలో కార్పొరేట్ సంస్థల హవా చాలా జోరుగా సాగుతోంది. ప్రతిఒక్కరు ఇటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ముందుగా మహిళలు ఇటువంటి వ్యవహారాలలో చాలా ముందున్నారు. మగవారికి ధీటుగా ఆడవాళ్లు... Read more
Apr 22 | కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే నెపంతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని... Read more
Apr 10 | ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారికి సమానంగానే గట్టిపోటీని ఇస్తున్నారు. వారు కూడా మగవారిలాగా ఆఫీసు పనులలో నిమగ్నమై విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆఫీసు పని ఎక్కువగా వుండటం వల్ల తమ వ్యక్తిగత... Read more