gopichand latest movie title fixed as soukyam in which regina is playing actress role

Gopichand latest movie title fixed as soukyam

gopichand latest news, gopichand soukyam movie, soukyam movie updates, gopichand movies, regina cassandra, regina updates

gopichand latest movie title fixed as soukyam : the latest updates of gopichand latest movie soukyam which is directed by ravikumar.

నలుగురి ‘సౌఖ్యం’ కోసం ఆరాటపడుతున్న మాచోమ్యాన్

Posted: 10/27/2015 05:32 PM IST
Gopichand latest movie title fixed as soukyam

టాలీవుడ్ మాచోమ్యాన్ గా పేరుగాంచిన గోపీచంద్.. ఇప్పుడు నలుగురి సంతోషం కోసం పాటుపడుతున్నాడు. ఇతరుల ఆనందం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వున్నానంటూ ముందుకొస్తున్నాడు. అయితే.. నలుగురి సౌఖ్యం కోసం అతడు రౌడీలను కొడుతూ భారీ యాక్షన్ చేస్తాడా..? అలాకాకుండా తనలో దాగిన కమెడియన్ ని బట్టబయలు చేసి ఎంటర్టైన్ మెంట్ చేస్తాడా..? అనేది రహస్యంగా మారింది. ఈ వివరాలు తెలియాలంటే.. త్వరలోనే విడుదల కాబోతున్న గోపిచంద్ సినిమాను వెండితెరపై చూడాల్సిందేనని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్’ హ్యాట్రిక్ విజయంతో ఫుల్ జోష్ లో వున్న గోపీచంద్.. ప్రస్తుతం ఎ.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సౌఖ్యం’ టైటిల్‌ను ఖరారు చేశారు. తొలుత ఈ మూవీ టైటిల్ కి సంబంధించి గతంలో కొన్ని ప్రచారాలు జరిగాయి కానీ.. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని యూనిట్ పేర్కొంది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదని అప్పట్లో దర్శకనిర్మాతలు చెప్పారు. తాజాగా కొన్ని టైటిల్స్ ని పరిశీలించిన అనంతరం ‘సౌఖ్యం’ ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమాలో హీరోకి హెల్పింగ్ నేచుర్ ఎక్కువగా వుంటుంది కాబట్టి.. స్టోరీకి తగ్గట్టే ఆ టైటిల్ ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాగురించి నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘మనుషుల మధ్య అనుబంధాలను స్పృశించే సినిమా ఇది. రవికుమార్-గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన  ‘యజ్ఞం’ ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. టాకీ పూర్తయ్యింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు విదేశాల్లో మూడు పాటల చిత్రీకరిస్తాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తాం. డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఇక పదేళ్ల తర్వాత గోపీచంద్‌తో వర్క్ చేయడం ఆనందంగా వుందంటూ దర్శకుడు రవికుమార్ పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopichand soukyam movie  regina cassandra  as ravikumar  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

Today on Telugu Wishesh