హ్యాట్రిక్ విజయాలతో దూకుడుమీదున్న యువహీరో నిఖిల్.. ప్రస్తుతం ‘శంకరాభరణం’ చిత్రం షూటింగులో బిజీగా వున్నాడు. ప్రముఖ రచయిత కోనవెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన ‘ప్రేమకథాచిత్రం’ ఫేం నందిత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా బీహార్ నేపథ్యంలో సాగే ఓ యధార్థ ఘటన ఆధారంతో తెరకెక్కుతున్నట్లు ఇదివరకే యూనిట్ బృందం వెల్లడించిన విషయం తెలిసిందే!
ఇదిలావుండగా.. గతకొన్నాళ్ల నుంచి ప్రీ-ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఈనెలలో ప్రారంభమైంది. ఈనెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పూణె సమీప గ్రామాల్లో మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా దర్శకనిర్మాతలు వెల్లడించారు. బీహార్ నేపథ్యంలో కొనసాగే కథకి తగ్గట్టుగానే ఈ మూవీ షూటింగ్ కష్టతరమైన ప్రదేశాల్లో జరుపుతున్నట్లుగా నిర్మాతలు వెల్లడించారు. ఈ సీన్ల కోసం హీరో నిఖిల్ చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నాడని, ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ బృందం తెలుపుతోంది. ఈ మూవీలో నిఖిల్ సరికొత్త పాత్రలో కనువిందు చేయనున్నాడని.. ఈ మూవీ కోసం నిఖిల్ చాలానే కష్టపడుతున్నాడని మూవీవర్గం స్సష్టం చేస్తోంది.
ఈ సినిమా స్టోరీ ‘క్రైమ్ కామెడీ’తో కూడినదిగా తమ మూవీ ఫస్ట్ లుక్ ద్వారా ప్రేక్షకులకు తెలియపరిచినందుకు సంతోషంగా వుందని కోనవెంకట్ తెలిపారు. నిర్మాత, తన కాంబోలో ఇదివరకే వచ్చిన ‘గీతాంజలి’ సినిమా మంచి విజయం సాధించిందని పేర్కొన్న కోన.. ఈ సినిమా కూడా ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more