naga chaitanya redbull f1 show run promotion promo video | kriti sanon

Naga chaitanya redbull f1 show run promotion promo video

naga chaitanya news, naga chaitanya updates, naga chaitanya story, naga chaitanya racing, naga chaitanya f1 race, naga chaitanya promotion video, naga chaitanya movies, naga chaitanya photos, naga chaitanya, redbull f1 show run, redbull f1 show run promo video

naga chaitanya redbull f1 show run promotion promo video : Naga chaitanya feeling happy to take part in redbull f1 show run promotion promo video. This is his childhood dream.

‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’

Posted: 04/04/2015 04:58 PM IST
Naga chaitanya redbull f1 show run promotion promo video

‘జోష్’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు నాగచైతన్య.. ఆ తర్వాత సమంతాతో కలిసి ‘మాయ’ చేశాడు. ఆ తర్వాత ఇతను నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అయితే.. కుటుంబసభ్యులతో కలిసి ‘మనం’ చిత్రం ద్వారా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇక ఇటీవలే ఈ హీరో ‘ఓ లైలా కోసం’ చేసిన ప్రయత్నం ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ హీరో కృతిసనన్ తో జతకట్టి త్వరలోనే ‘దోచేయ్’డానికి సిద్ధమవుతున్నాడు.

ఇదిలావుండగా.. ‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’ అని మాజీ ప్రధాని అబ్దుల్ కలాం చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే వుంటాయి. ప్రస్తుతం నాగచైతన్య ఆ మాటలనే పాటిస్తున్నాడు. ఏదో ఒక రోజు మన కలలు తప్పకుండా నెరవేరుతాయని ఈ యంగ్ హీరో చెబుతున్నాడు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. నాగచైతన్య కూడా గత కొన్నాళ్ల నుంచి ఓ విషయంలో కలలు కంటూ వస్తున్నాడు. ఇప్పుడు చాలారోజుల తర్వాత అది నెరవేరడంతో ఫుల్ హ్యాపీగా వున్నాడు.

విషయం ఏంటంటే.. నాగచైతన్యకి చిన్నప్పటి నుంచి కార్ల పిచ్చి ఎక్కువగా వుండేది. రేసింగ్ అంటే పడిచచ్చేవాడు కూడా! అప్పటి నుంచి రేసింగ్ లో పాల్గొనాలన్న కోరిక ఇప్పుడు తాజాగా నెరవేరింది. ‘రెడ్ బుల్ ఎఫ్1 షో రన్’ ప్రమోషన్ కోసం చిత్రీకరించిన ప్రోమో వీడియోలో చైతు పాల్గొన్నాడు. ఈ అవకాశం ఓ యాడ్ రూపంలో రావడంతో చైతూ చాలా సంతోషంగా వున్నాడు. కలలు కంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే చైతూ ట్విటర్ లో.. ‘ఇదిగో.. కలలు కంటే ఇలాగే నెరవేరుతాయి. ఈ ప్రోమో వీడియో షూటింగ్ బాగా ఎంజాయ్ చేశాను’ అంటూ ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ హీరో పోస్ట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  redbull f1 show run  kriti sanon  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more