Chit chat with businessman director puri jagannath

Chit Chat With Mahesh Babu On Businessman,videos,Mahesh Babu,Profile_Business Man,Chit Chat With Mahesh Babu On Businessman,Chit Chat With Mahesh Babu,Mahesh Babu On Businessman,Mahesh Babu Interview On Businessman,Mahesh Babu Latest Chit Chat,Mahesh Babu Latest Interview,Mahesh Babu Talks About Businessman,,way2movies, movies, movie, way2movie, telugu movies, latest telugu movies,telugu pictures,latest telugu wallpapers, pictures, telugu movie reviews, movie posts, telugu movie posts, wallpapers, images, latest movie news, latest telugu movie gossips, movie gossips, heroin images, heroin wallpapers, latest wallpapers, telugu movie ratings, latest movie ratings

Chit Chat With Mahesh Babu On Businessman.Businessman Movie directed by Puri Jagannath and movie main star cast is Mahesh Babu , Kajal Agrawal are playing lead role in this movie .Chit Chat With Mahesh Babu

Chit Chat With Businessman Director Puri.gif

Posted: 01/19/2012 01:41 PM IST
Chit chat with businessman director puri jagannath

Director_Puri_Jaganath1

Director_Puri_Jaganathపూరి జగన్నాథ్.. తెలుగు చిత్ర పరిశ్రలో ఉన్న డైరెక్టర్లలో ఒక డిఫరెంట్ డైరెక్టర్. ఎన్నో విభిన్నా కథాంశాలతో సినిమాలు ప్రేక్షకుల మనస్సులతో పాటు యూత్ ని బాగా ఆకర్షించాడు. పూరిజగన్నాథ్ తీసిన ‘పోకిరి’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అదే రేంజ్ లో తాజాగా తీసిన ‘బిజినెస్ మెన్’ అదే రేంజ్ లో బిజినెస్ చేస్తుంది. మరి ఆ సందర్భంగా పూరి చెప్పిన కొన్ని విషయాలు.....పరిశ్రమ రికార్డ్‌! ముందే చెప్పినట్టు.. భారీ అంచనాలను అందుకుంది మా బిజినెస్‌. అమెరికా, బ్రిటన్‌ అన్నిచోట్లా అద్భుత వసూళ్లు సాధించింది. రాజమండ్రిలో ఎలానో చికాగోలోనూ అలానే నడుస్తోందీ సినిమా.

బిజినెస్‌ థ అలా ఉంచితే.. ముఖ్యంగా మహేష్‌ చెప్పిన సంభాషణలకు విపరీతమైన స్పందన వస్తోంది. రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా ఒకే మనిషి చెప్పే డైలాగ్స్‌ వినడం కష్టం. చెప్పింది మహేష్‌ కాబట్టే వింటున్నారు. పరిపూర్ణుడు: నిజానికి ఈ సినిమా కథ తెలీకుండానే మహేష్‌ సగం షూటింగ్‌ పూర్తిచేశాడు. ఆ తర్వాత కథ విన్నాడు. అయినా..ఎక్కడా కంటిన్యుటీ అనేది చెడలేదు. ఓ నటుడిగా మహేష్‌ ఇప్పుడు పరిపూర్ణుడు. వాయిస్‌ నుంచి అన్నిటా మెరుగయ్యాడు. ‘పోకిరి’కి ఇప్పటికీ ఎంతో తేడా వచ్చింది.

చెప్పినవన్నీ నిజాలే:  మనం నమ్మే నీతినియమాలు, సిద్ధాంతాల నుంచి పుట్టిన కథ బిజినెస్‌మేన్‌. హీరో సమాజానికి వ్యతిరేకంగా ఉంటాడు. కానీ చెప్పేదాంట్లో అంతా నిజమే ఉంటుంది. అది జనానికి బాగా కనెక్ట్‌ అయింది. అలాగే సినిమాలో చూపినట్టు అన్నీ జరగవు కదా! అంటున్నారు. స్క్రీన్‌ప్లే విషయంలో మరీ వివరణాత్మకంగా వెళితే జనాలకి నచ్చదు. అందుకే ఏం చూపించాలో అదే చూపించాను. సినిమాలో లోపాలు వెతికితే చాలా ఉన్నాయి. అవన్నీ తెలియక కాదు. వదిలేయాల్సినవి వదిలేసి జనాలకు కావాల్సిందే చూపాను. ఈ సినిమా డాక్టర్లు, ఐపిఎస్‌లను సైతం మెప్పించింది.

హీరో ఎవరి మాటా వినడు:  జీసస్‌,గౌతమ బుద్ధుడు ఏ మనిషి మాట విన్నారు? మనం చేయాలనుకున్నది చేయడమే. ఆపితేనే సమస్య. అన్నిటా వెనుకబడిపోతాం. మనం ఏం నేర్చాం అనేదానిని బట్టి ఏదైనా పుడుతుంది. నా నిజజీవితం నుంచి నేర్చుకున్నవే కథ, డైలాగుల్లో రాస్తాను. అలాగే నేను అనే స్వార్థం మనిషికి అవసరం. అది లేకపోతే ఏదీ లేదు. ఇదంతా నాకెందుకు ..అని అనుకుంటే ఇక సన్యాసి అయిపోయినట్టే. అదే స్వార్థాన్ని నా హీరోకి ఆపాదించాను. ఈ స్క్రిప్టుకి మహేష్‌ని తప్ప వేరెవరినీ ఊహించలేం.

నా పాత్రే అది:  ఈ సినిమాలో మహేష్‌ పాత్రలో నేనే కనిపిస్తాను. ఆ పాత్రలో ఫిలాసఫీ అనేది ఉంటుంది. జీవితంలో ఎన్నో దెబ్బలు తింటేనే అదొస్తుంది. నమ్మినవారు మోసం చేసినా, అపజయా లతో విపరీతంగా విసిగిపోయినా.. ఆ తరహా డైలాగులు పుడతాయి. కామెడీ

కుదరదు: ‘బిజినెస్‌మేన్‌’ స్క్రిప్టులో ఓ ఫైర్‌ ఉంది. మహేష్‌ పాత్ర ఓ ఫైర్‌తో ముందుకెళుతుంటుంది. అలాంటి సమయంలో ప్రత్యేకంగా కామెడీకి ట్రాక్‌ పెడితే బావుండదు. సీరియస్‌నెస్‌ తగ్గుతుంది. నిజానికి ‘పోకిరి’లోనే కామెడీనే తీసేయమన్నారు. కృష్ణ తర్వాత మహేష్‌: మహేష్‌ ఏదైనా సింగిల్‌ టేక్‌లో చేసేసేవాడు. పేజీన్నర డైలాగులు ఏ కంఠతా లేకుండా చెప్పేసేవాడు. నేను స్పాట్‌లో చెప్పింది చెప్పినట్టే చెప్పేసేవాడు. అప్పట్లో సూపర్‌స్టార్‌ కృష్ణ మాత్రమే అలా చెప్పేవారు. ఈ సినిమా టైంలో తనే గుర్తొచ్చారు.

బిజినెస్‌ కోసం: ముంబైని ...చ్చ పోయించకపోతే..మనం బతకలేం. ఎందుకంటే బిజినెస్‌ జరగాలి కదా. అందుకే పోయించాం.

స్క్రిప్టు మార్కెట్లోకి: మా ఇంట్లో ‘తోటికోడళ్లు’ స్క్రిప్టు ఉండేది. చిన్నప్పుడే ఓ సారి చదివి సినిమా స్క్రిప్టు ఇలా ఉంటుందా? అని తెలుసుకున్నా. అలాగే అంతా తెలుసుకోవాలనే ‘బిజినెస్‌మేన్‌’ స్క్రిప్టును పుస్తకంగా రిలీజ్‌ చేయనున్నా. సంభా షణలు సహా అన్నీ అందులో ఉంటాయి.

హిందీలోనూ.. ‘బిజినెస్‌మేన్‌’ను రీమేక్‌ చేయనున్నాం. మహేషే హీరో. అదేగాక ‘బిజినెస్‌మేన్‌-2’ కూడా రాస్తున్నా. సీక్వెల్‌లోనూ ప్రిన్సే హీరో. తదుపరి రవితేజ, ఎన్టీఆర్‌లతో సినిమాలున్నాయి. వాటి మధ్యలోనో లేదా పూర్తయ్యాకో సెట్స్‌కెళతాం. అలాగే ‘బిజినెస్‌..’ కథను ఉత్తరాది వారికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంది. కొన్ని కరెక్షన్లు, మార్పులు ఉంటాయి. ఇక్కడైతే మహేష్‌తో మ్యాజిక్‌ చేయొచ్చు. అక్కడ పరిస్థితులు వేరు. అయినా బాలీవుడ్‌లో మహేష్‌ లాంటి వాడు ఉండాలి కదా!

నిర్మాత గ్రేట్‌: ప్రతి సినిమాకి పైసలు పెట్టా. ఈ సినిమాకి బ్రెయిన్‌ కూడా పెట్టానన్నారు నిర్మాత వెంకట్‌. 3 నెలల్లో నేను సినిమా

పూర్తిచేస్తే.. 6నెలల ముందునుంచి థియేటర్‌ రిలీజ్‌ ప్లాన్‌ చేశారాయన. నాపై నమ్మకంతో కథ కూడా వినకుండా సినిమా తీశారు.

రూల్‌ చేయాలి: సమాజాన్ని రూల్‌ చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. స్వార్థం మంచిది కాదు అంటారు. లేకపోతే ఎలా? ఈగో కూడా ఉండాలి. ఇదంతా ఎందుకులే అనుకుంటే మనిషి సన్యాసి అవుతాడు. ఈ సినిమాలో మహేష్‌ పాత్ర నుంచి ఇవన్నీ నేర్చుకోవాల్సినవే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna new movie
Ileana hot at snehitudu audio launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more