Kidambi Srikanth Crashes Out of Australian Open Superseries

Srikanth jwala ashwini lose in australia open

Badminton, Kidambi Srikanth Crashes Out of Australian Open Superseries, Hans-Kristian Vittinghus, Denmark, China, Tian Houwei, latest Badminton news, Jwala Gutta, Ashwini Ponnappa, Indonesia, Nitya Krishinda Maheswari, Greysia Polii

World no. 4 Kidambi Srikanth went down to unseeded Tian Houwei of China in the second round of the Australian Open Superseries.

శ్రీకాంత్, గుత్తాజ్వాలా, అశ్వినీల పరాజయం

Posted: 05/28/2015 11:24 PM IST
Srikanth jwala ashwini lose in australia open

ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రపంచ నాలగో నెంబర్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పోరు ముగిసింది. రెండో రౌండ్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో ఆయన తన ప్రత్యర్థి క్రీడాకారుడు చైనీస్ ఆటగాడు తియాన్ హువీ  చేతిలో 21-18, 17-21, 13-21 తేడాతో ఓటమి చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకున్న శ్రీకాంత్ ఆ తరువాత బొక్క బోర్లాపడ్డాడు. వరుస గేమ్ లను చేజార్చుకుని పరాజయం చెందాడు. కేవలం ఒక గంటా ఎనిమిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీకాంత్ ఆశించినంతంగా ఆకట్టుకోలేదు.

కాగా తొలి రౌండ్ లో హన్స్ క్రిస్టియన్ విట్టింగస్ ను 14-21, 21-8 22-20లతో ఓడించిన శ్రీకాంత్ తొలి గేమ్ లో ఓడినా.. ఆ తరువాత కోలుకుని మిగిలిని రెండు సెట్లలో బాగా రాణించి రెండో రౌండ్ కు చేరుకున్నాడు. ఇదిలా ఉండగా మహిళల విభాగంలో గుత్తా జ్వాలా- అశ్విని పోనప్పల జోడి కూడా నిరాశ పరిచారు. కేవలం 32 నిమిషాలలోనే వారు తమ ప్రత్యర్థి క్రీడాకారులు ఇండోనేషియా జోడీ నిత్యా క్రిషిందా మహేశ్వరి -రేసియా చేతిలో 21-14, 21-10 తేడాతో జ్వాల జోడి ఓటమి పాలయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles