Saina Nehwal enters into Australian Open quarterfinals

Saina nehwal enters quarter finals

Saina Nehwal enters into Australian Open quarterfinals, India's ace shuttler Saina Nehwal, Saina Nehwal, Australian Open, Sun Yu, championship second round, fifth seed Wang Shixian, quarterfinals, Defending champion status

India's ace shuttler Saina Nehwal sealed her place in the quarterfinals of the Australian Open on Thursday

అస్ట్రేలియా ఓపెన్: క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన సైనా

Posted: 05/28/2015 09:56 PM IST
Saina nehwal enters quarter finals

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ సైనా నెహ్వాల్ ముందుకు దూసుకుపోతోంది. గురువారం జరిగిన ప్రి క్వార్ట్రర్ పోరులో సైనా నెహ్వాల్ తన ప్రత్యర్థి క్రీడాకారిణి ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)ను 21-19, 19-21,21-14 తేడాతో ఓడించి అస్ట్రేలియా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరింది. ఈ పోరులో తొలి సెట్ ను కష్టపడి గెలిచిన సైనా.. రెండో గేమ్ ను కోల్పోయింది. కాగా  నిర్ణయాత్మక మూడో గేమ్ లో సైనా ఆకట్టకుంది.

తన అనుభవాన్ని ఉపయోగించి సున్ యు పై పైచేయి సాధించింది. దీంతో ఈ ఇద్దరి క్రీడాకారుణుల ముఖాముఖి రికార్డును సైనా మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య ఐదు మ్యాచ్ లు జరగ్గా.. నాలుగింటిలో సైనా విజయం సాధించింది. ఇదిలావుండగా శుక్రవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్స్ తో సైనా ప్రపంచ ఐదవ సీడ్ క్రీడాకారణి వాంగ్ షియాన్ తో తలపడనుంది. ఇప్పటి వరకు వీరిద్దరి మద్య 11 మ్యాచ్ లు జరగ్గా ఆరింటిలో గెలచి సైనా పైచేయి సాధించింది. అదే ఆటతీరును కనబర్చి సెమీస్ కు దూసుకెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australian Open  Saina Nehwal  quarterfinals  

Other Articles