'Dreams do come true', tweets Dinesh Karthik కలలు సాకరం చేసుకోబడతాయి: దినేశ్ కార్తీక్ ట్వీట్ వైరల్

Karthik s four word tweet takes internet by storm as ind name bumper t20wc squad

karthik,india,dinesh,dinesh karthik,india squad,india squad t20 world cup,t20 world cup 2022 schedule,t20 world cup 2022 india squad,india t20 world cup squad 2022,t20 world cup india squad,t20 world cup 2022 team players list,india squad for t20 world cup,india t20 world cup squad 2022 playing 11,india t20 world cup squad,india icc t20 world cup,indian squad for t20 world cup,t20 world cup,t20 world cup 2022,world cup 2022 schedule,world cup,bcci,t20 world cup india squad announced date,india t20 world cup squad 2022 prediction,india t20 world cup 2022,world cup t20,jasprit bumrah,harshal patel, dream come true, dinesh karthik tweet, cricket news, sports news, cricket, sports

He has put up consistent performances in the T20 format, the Nidahas Trophy blitz being the highlight, but Dinesh Karthik's ultimate goal is to lift the upcoming T20 World Cup. The seasoned wicketkeeper-batter was picked for the showpiece event in Australia as India named a star-studded 15-member squad

కలలు సాకరం చేసుకోబడతాయి: దినేశ్ కార్తీక్ ట్వీట్ వైరల్

Posted: 09/13/2022 08:08 PM IST
Karthik s four word tweet takes internet by storm as ind name bumper t20wc squad

టీమిండియా మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడినప్పుడు ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న తనకు ఇన్నాళ్లకు మళ్లి జట్టులో స్థానం లభించింది. అయితే ఈ మధ్యలో మాత్రం ఆయన చాలా అనుభవాన్నే గడించారు. టీమిండియా టీ20 జట్టులో స్థానం కోల్పోయి.. అప్పుడప్పుడు తలుక్కున మెరుస్తూ.. వివిధ కారణాలతో జట్టులోకి వస్తూ పోతూనే ఉన్నాడు. చివరకు ఆశలు వదిలేసుకొని కామెంటేటర్ అవతారమూ ఎత్తాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతని రోల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్పష్టత ఇవ్వడంతో చెలరేగిపోయాడు.

అంతే ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతనే కర్ణాటక స్టార్ బ్యాటర్ దినేష్ కార్తీక్. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో ఐపీఎల్‌ పుణ్యమా అని టీమిండియా తలుపు తట్టాడీ వికెట్ కీపర్ బ్యాటర్. 37 ఏళ్ల వయసులో భారత జట్టులో పునరాగమనం చేసి, తొలిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేస్తున్న అతన్ని టీ20 ప్రపంచకప్‌లో ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఐపీఎల్‌లో అదరగొడుతున్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడిన డీకే.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడటమే తన కోరిక అని చెప్పాడు. ఇప్పుడు ఆ కల నెరవేరడంతో డీకే ఆనందానికి హద్దులేకుండా పోయింది. టీ20 ప్రపంచకప్‌ జట్టులో తన పేరు ఉండటంతో ‘కలలు నిజం అవుతాయి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డీకే క్రికెట్ కెరీర్ ఏదో చందమామ కథలా ఉందంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles