Sakshi quashes rumours of MS Dhoni's retirement ధోని వెంటపడ్డ నెటిజనులు.. అవన్నీ పుకార్లేనన్న సాక్షీ

Get a life sakshi quashes rumours of ms dhonis retirement

Mahendra Singh Dhoni, Dhoni's wife Sakshi, MS Dhoni, Mr Cool, Indian wicket keeper, retirement from international cricket, #DhoniRetires, cricket, sports

Mahendra Singh Dhoni's wife Sakshi has once again rubbished the rumours of the veteran wicketkeeper-batsman's retirement from international cricket. Certain users on Twitter started to spread rumours of Dhoni's retirement with hashtag #DhoniRetires. However, those following the former Indian captain ardently maintained that these were false rumours.

ధోని వెంటపడ్డ నెటిజనులు.. అవన్నీ పుకార్లేనన్న సాక్షీ

Posted: 05/29/2020 08:07 AM IST
Get a life sakshi quashes rumours of ms dhonis retirement

టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ధోని మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ సారి మళ్లీ ఆయన తన రిటైర్మెంట్ విషయమై నెట్టింట్లో చర్చనీయాంశంగా మారారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన రిటైర్మెంట్‌పై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. ట్విటర్‌లో #DhoniRetires అనే హ్యాష్ టాగ్ బాగా ట్రెండ్ అయ్యింది, దీంతో ఈ విషయమై ఆయన భార్య సాక్షీ ధోని స్పందించారు. తన భర్త రిటైర్మెంట్ విషయాన్ని మరోమారు సామాజిక మాధ్యమాల్లో పెట్టి వైరల్ చేస్తున్నవారి మానసిక పరిస్థితి గురించి ఆమె ప్రస్తావించారు.

అమె ఏమన్నారంటే.. ‘‘లాక్ డౌన్ తో పుకార్లు ప్రచారం చేసే వారి మానసికస్థితి దెబ్బతినిందని అర్థం చేసుకుంటా’’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఆ తర్వాత ట్వీట్ ను డిలీట్ చేశారు. ఇదిలావుండగా, గత ఏడాది జరిగిన ఐసీసీ పరిమిత ఓవర్ల వన్డే ప్రపంచకప్ లో చివరిసారిగా ధోని తన బ్యాట్ తో పరుగులు రాబట్టాడు. ప్రత్యర్థి న్యూజిలాండ్ తో సెమీఫైనల్లో ఆడిందే చివరి మ్యాచ్. టీమిండియా ప్రపంచ కప్ లో తిరుగుముఖం పట్టిన తరువాత ఆయన ఆట నుంచి విరామం ప్రకటించుకున్నారు. కొద్ది రోజులు భారత సైన్యంలో పనిచేశారు. అనంతరం ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ధోనీ మళ్లీ టీమిండియా జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తారని, అందుకు ఆయన ఐపీఎల్‌ నే వేదికగా మలచుకుంటారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల ప్రకారమే ఆయన మార్చిలో చెన్నైకు వెళ్లి సాధన కూడా చేశాడు. అయితే జట్టులోకి పునరాగమనం చేయాలన్న ఆయన ఆశలపై కరోనావైరస్ మహమ్మారి నీళ్లు చల్లింది. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ కూడా వాయిదా పడింది. దీంతో ధోనీ రిటైర్మెంట్‌పై మళ్లీ సామాజిక మాధ్యమాల్లో వార్తలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే పలువురు క్రీడా ప్రముఖులు మాత్రం ధోని రిటైర్మెంట్ ప్రస్తావించాల్సిన అవసరమేమిటని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Ganguly says entire system helped chappell drop him from indian team

    అంతా కలిసే నన్ను అన్యాయంగా తప్పించారు: సౌరవ్ గంగూలీ

    Jul 12 | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికోందరు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని... Read more

  • Tendulkars knock in chennai higher than sehwags 309 saqlain mushtaq

    ‘‘వీరూ ట్రిపుల్ సెంచరీ కన్నా టెండుల్కర్ శతకం మిన్నా’’

    Jul 12 | భారత జట్టులో అటు టెస్టు కానీ ఇటు పరిమిత ఓవర్లు మ్యాచుల్లో కానీ సచిన్ టెండుల్కర్ అనగానే క్రికెట్ దేవుడిగా కోలిచేవారి సంఖ్య అధికం. ఇక మాజీ ఇండియన్ టీమ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర... Read more

  • Yuvraj singh maafi maango trends on twitter for making casteist remark on chahal

    యువరాజ్ సింగ్ పై పోలీసు కేసు.. అరెస్టుకు అవకాశం..

    Jun 05 | టీమీండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గత కొన్నాళ్లుగా యువీ టైం బాగోలేదనుకుంటా.. అయితే సమయం కలసిరాని సందర్భాల్లో సంయమనం పాటిస్తూ మౌనంగా వుండాలే తప్ప.. సరదా కోసం కూడా... Read more

  • Sri lanka cricket says 3 former players in icc graft probe

    ముగ్గురు శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ పై ఐసిసి విచారణ

    Jun 05 | క్రికెట్ ప్రపంచాన్ని ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజల అభిమాన క్రీడా క్రికెట్ ను ఫిక్సింగ్ మాఫియా తమ కబంధ హస్తాలలోకి తీసుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. అంతర్జాతీయ... Read more

  • Suresh raina on ms dhonis tireless training in csks camp

    రైనా చూసిన మహిభాయ్ విభిన్న సాధన

    Jun 04 | టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ ధోని రిటైర్మెంట్ పై వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయన ఎంతలా కష్టపడుతున్నారు.. అందుకు ఎలా సన్నధమవుతున్నారో చెప్పుకోచ్చాడు టీమిండియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్... Read more

Today on Telugu Wishesh