Virat Kohli, pujara, rahane, mayank in top 10 Test rankings టెస్టు ర్యాంకింగ్స్: టాప్ ప్లేస్ కు 3 పాయింట్ల దూరంలో కోహ్లీ

Icc test rankings 2019 virat kohli pujara rahane mayank in top 10 rankings

icc test rankings, icc test rankings 2019, icc test rankings batting, icc test rankings bowling, virat kohli test ranking, jasprit bumrah test ranking, cheteshwar pujara, ajinkya rahane, steve smith, jasprit bumrah, ravichandran ashwin, cricket news, sports news, cricket news, sports news, cricket, sports

ICC Test Rankings 2019: Indian skipper Virat Kohli and injury-sidelined Jasprit Bumrah have maintained their top spots in the latest ICC ODI Player Rankings for batsmen and bowlers respectively.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: టాప్ 10లో 2,4,5,9 ర్యాంకులు టీమిండియావే..

Posted: 11/26/2019 07:08 PM IST
Icc test rankings 2019 virat kohli pujara rahane mayank in top 10 rankings

టెస్టు క్రికెట్ లో సంచలన విజయాలను నమోదు చేసుకుంటున్న టీమిండియా.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లోనూ దుమ్మురేపింది. బ్యాటింగ్‌ జాబితాలో నలుగురు ఆటగాళ్లు టాప్-10లో నిలువగా, బౌలింగ్ లో టాప్ 10 ఇద్దరు ఆటగాళ్లు మెరిసారు. అలాగే ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా తన రెండో స్థానాన్ని స్థిరంగా వుంచుకోగలిగాడు. పరుగుల యంత్రంగా ఖ్యాతి చెందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ ను అక్రమించుకునేందుక కేవలం మూడు పాయింట్ల దూరంలో వున్నాడు.

దీంతో ఆయన తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ (928) తన రేటింగ్‌ పాయింట్లను భారీగా పెంచుకున్నాడు. టాప్ ప్లేస్ లోని స్టీవ్‌ స్మిత్‌ (931) కన్నా కేవలం మూడు పాయింట్ల వెనక ఉన్నాడు. అంతరాన్ని 25 నుంచి 3 పాయింట్లకు తగ్గించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన చారిత్రక డే/నైట్‌ టెస్టులో కోహ్లీ శతకం (136) బాదిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ద్విశతకం అందుకున్న ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఒక స్థానం ఎగబాకి 9వ ర్యాంకు చేరుకున్నాడు. అతడి ఖాతాలో 700 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి.

ఛెతేశ్వర్‌ పుజారా (791), అజింక్య రహానె (759) వరుసగా నాలుగు, ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్‌ ఆల్ రౌండర్‌ బెన్ స్టోక్స్‌ తొలిసారి టాప్‌-10లో అడుగుపెట్టాడు. న్యూజిలాండ్‌ టెస్టులో అతడు 91, 28 పరుగులు చేశాడు. చారిత్రక గులాబి బంతి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ప్రధాన ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ నాలుగు స్థానాలు మెరుగై 26వ ర్యాంకు సాధించాడు. ఎనిమిది స్థానాలు ఎగబాకిన లిటన్‌దాస్‌ 78వ స్థానంలో నిలిచాడు.

బౌలర్ల జాబితాలో ఇషాంత్‌ శర్మ (716 పాయింట్లు)  17వ ర్యాంకులో ఉన్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ (672) ఒక స్థానం మెరుగై  21వ ర్యాంకు సాధించాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (772) 9, జస్ప్రీత్‌ బుమ్రా (794) 5వ స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా (725) ఒక స్థానం మెరుగై ఆల్‌రౌండర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్‌ ఐదో స్థానంలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles