kohli says sorry to Sadeera Samarawickrama లంక బ్యాట్స్ మెన్ కు కోహ్లీ క్షమాపణలు

Sadeera samarawickrama struck by ball again

ind vs sl,ind vs sl test,ind vs sl 3rd test,virat throw hits sadeera,ouch,sorry mate,virat throw hit on the elbow of sadeera,virat kohli,dinesh chandimal,sadeera samarawickrama,ravichandran ashwin,sri lanka national cricket team,sri lanka,india national cricket team, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Sri Lankan opening batsman Sadeera Samarawickrama seems to find the ball more on his body than willow, as he had been struck by the ball thrice in indian tour

లంక బ్యాట్స్ మెన్ కు కోహ్లీ క్షమాపణలు

Posted: 12/04/2017 08:19 PM IST
Sadeera samarawickrama struck by ball again

టీమిండియ కెప్టెన్, పరుగుల మిషన్ విరాట్‌ కోహ్లి దూకుడు గురించి తెలియంది కాదు.. అటు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు పరుగుల వేట సాగించే కెప్టెన్,  ఇటు ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు ఒక్క పరుగు కూడా ఇవ్వకూడదన్న యోచనలో తన జట్టుతో కలసి నిరంతరం శ్రమిస్తాడు. నిత్యం తన జట్టును హుషారుపరుస్తూ.. చురుకుగా ఉంటాడు. అయితే శ్రీలంకతో మూడో టెస్టు సందర్బంగా విరాట్ తన దూకుడుతో లంక క్రికెటర్ సదీరా సమరవిక్రమేకు తీవ్ర గాయం చేసేవాడే.. కానీ కాసింతలో ఆ ముప్పు తప్పింది.

అదెలా అంటే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఇవాళ ఆటలో టీ విరామం తరువాత ఇన్నింగ్స్‌ 116 ఓవర్ ను అశ్విన్ వేశాడు. ఆ క్రమంలోనే రెండో బంతిని ఆడిన చండిమాల్‌ మిడాన్ వైపు షార్ట్ కొట్టాడు. ఆ సమయంలో మిడాన్ లో ఉన్న కోహ్లి బంతిని చాకచక్యంగా ఆపాడు. అంతే వేగంగా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న సదీరా వైపు విసిరాడు. దాంతో ఆ బంతి సదీరా వెనుకవైపు బలంగా తగిలింది. కాకపోతే సదరు క్రికెటర్‌ ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆపై వెంటనే సదీరా వద్దకు వెళ్లిన కోహ్లి.. సారీ బ్రదర్‌ అంటూ క్షమాపణలు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ind vs sl  virat kohli  sadeera samarawickrama  sorry  on field  icc  sri lanka  TeamIndia  cricket  

Other Articles