wishes pour in for kumble on his 47 birthday జంబో కుంబ్లేకు క్రికెటర్ల జన్మధిన శుభాకాంక్షలు..

Happy birthday jumbo cricketers wish anil kumble on his 47th birthday

anil kumble birthday, virender sehwag, happy birthday anil kumble, kumble birthday, birthday wishes, virender sehwag, sachin tendulkar, mohammad kaif, vvs laxman, adam gilchrist, harbhajan singh, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Anil Kumble was wished by former and current India teammates and opponents alike on the occassion of his 47th birthday

బిసిసిఐపై అనీల్ కుంబ్లే అభిమానుల అగ్రహం..

Posted: 10/17/2017 07:44 PM IST
Happy birthday jumbo cricketers wish anil kumble on his 47th birthday

వినూత్న ట్వీట్లకు టీమిండియా డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టింది పేరు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత.. తన సహచరులతో పాటు సామాజిక అంశాలపై, యావత్ దేశ ప్రజలకు సంబంధించిన అంశాలపై ట్విట్టర్ ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ కు వెల్ కమ్ చెప్పిన సెహ్వాగ్.. ప్రాసను కొనసాగిస్తూ.. తనదైన శైలిలో చమత్కారాన్ని కూడా అద్ది మరీ వేడి వేడి ట్విట్లను వడ్డిస్తాడు. అంతే ఒక్కసారి ఓవెన్ నుంచి తీసీ తీయగానే గుమ్మగుమలాడేలా వుండే ట్విట్లు అభిమానుల మన్నన్నలను అందుకోవడం ఖాయం.

ప్రతీ ట్వీట్‌లోనూ వైవిధ్యం ఉండేలా చూసే సెహ్వాగ్.. విమర్శలను కూడా అంతే వ్యంగంగా వుండేట్లు చూస్తాడు. ఆయన విమర్శలు కూడా విపరీతంగా వైరల్ అయ్యిన విషయం అభిమానులకు తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకు బర్త్ డే విసెష్ చెప్పాడు. 'దంతెరస్‌' (ధన త్రయోదశి) రోజున భారత అతిపెద్ద ధనమైన అనిల్ కుంబ్లే పుట్టిన రోజు జరుపుకుంటున్న అనిల్ భాయ్ కు జన్మదిన శుభాకాంక్షలని తనదైన శైలిలో బర్తేడే విషెస్ చెప్పిన సెహ్వాగ్.. తనదైన ప్రాసతో.. చివర్లో జైజై శివ్ శంభో.. హ్యాపీ బర్త్ డే జంబో’ అని పేర్కొన్నాడు.

దీంతో పాటు ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ట్విట్ చేశాడు. ఈ ట్వీట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సెహ్వాగ్ తో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్, మహమ్మద్ ఖైఫ్, ది స్టైలిష్ బ్యాట్స్ మెన్ వివీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, అకాష్ చోప్రా, అడమ్ గిల్ క్రిస్ట్, చత్తీశ్వర్ పూజరాలతో పాటు దేశ విదేశీ క్రికెటర్లు అయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయనకు శుభాకాంక్షలు చెప్పే విధానంపై బిసిసిఐ విమర్శల పాలైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్ దిగ్గజాన్ని.. సాధారణ మాజీ క్రికెటర్ మాదిరగా సంబోధించిన కుంబ్లే అభిమానుల నుంచి అగ్రహాన్ని చవిచూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil kumble  birthday wishes  virender sehwag  sachin tendulkar  mohammad kaif  vvs laxman  cricket  

Other Articles