WIndies lose direct qualification for World Cup విశ్వవిజేత ప్రవేశాలలో.. విండీస్ కు ఎదురుదెబ్బ

West indies lose out on direct qualification for world cup

2019 World Cup, Chris Gayle, Cricket, England, Jason Holder, Marlon Samuels, Sri Lanka, Windies, ODI world cup 2019, World Cup 2018 qualifiers, sports news, cricket,

An England win helped Sri Lanka gain direct qualification to the 2019 World Cup, while the West Indies would now be forced to play the qualifiers in 2018.

విశ్వవిజేత ప్రవేశాలలో.. విండీస్ కు ఎదురుదెబ్బ

Posted: 09/20/2017 07:43 PM IST
West indies lose out on direct qualification for world cup

వన్డే క్రికెట్ లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్, మరోసారి ఫైనలిస్ట్ గా నిలిచిన వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2019 వన్డే ప్రపంచ కప్ కు డెరెక్ట్ క్వాలిఫైయింగ్ కు విండీస్ అవకాశం చేజారింది. బెయిర్ స్టో అద్బుత శతకంతో వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం విండీస్ అవకాశాలను దెబ్బతీసింది. ఫలితంగా శ్రీలంక జారవిడ్చుకున్న అవకాశాన్ని చేజిక్కించుకుంది. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో చివరి స్థానంలో ఉన్న లంక నేరుగా అర్హత సాధించింది.

ప్రస్తుతం లంక జట్టు 86 పాయింట్లు, విండీస్ 78 పాయింట్లతో ఉన్నాయి. అయితే 2019 వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించాలంటే ఈ నెల 30లోగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో ఉండాలి. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను విండీస్ 5-0తో గానీ, 4-0తో గానీ ముగిస్తే కరీబియన్ జట్టు టాప్‌-8లో నిలిచి క్వాలిఫై మ్యాచ్‌లు ఆడకుండానే నేరుగా అర్హత సాధించేది. తొలి వన్డేలో ఓటమిని చవిచూసిన విండీస్.. మిగిలిన మ్యాచ్ లలో విజయాలను సాధించినా ఫలితం ఉండదు. దీంతో 2018లో నిర్వహించే క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో రాణించి 2019 వన్డే ప్రపంచ కప్‌ బరిలో నిలవాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2019 World Cup  England  Jason Holder  Marlon Samuels  ODI world cup 2019  Sri Lanka  Windies  Cricket  

Other Articles