Adam Gilchrist is in Awe of MS Dhoni ధోనికి గిల్ క్రిస్ట్ నుంచి అభినందనలు..

Adam gilchrist is in awe of ms dhoni

adam gilchrist, dhawan, Dhoni Fifty, India vs West Indies 2017, kumara sangakkara, MS Dhoni, virat kohli, West Indies vs India, West Indies Cricket Board, West Indies Cricket Team, west indies, cricket news, cricket, sports news, latest news

Legendary Australian wicket-keeper Adam Gilchrist has paid tribute to former India skipper MS Dhoni after the latter overtook Gilly in the list of most number of runs scored by a wicket-keeper

ధోనికి గిల్ క్రిస్ట్ నుంచి అభినందనలు..

Posted: 07/04/2017 08:15 PM IST
Adam gilchrist is in awe of ms dhoni

వెస్టిండీస్ పర్యటనలో వున్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్, మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ నుంచి ప్రత్యేక సందేశం లభించింది. వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్లలో ధోనీ రెండో స్థానానికి చేరుకోవడం పట్ల ఈ సందర్భంగా గిల్లీ ఆనందం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో ధోనీ 9496 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలో 9410 పరుగులు చేసిన గిల్ క్రిస్ట్ ను అధిగమించాడు.

ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ధోనీకి గిల్లీ అభినందనలను తెలిపాడు. 'నన్ను అధిగమించినందుకు శుభాకాంక్షలు' అని మెసేజ్ పెట్టాడు. ధోనీతో కలసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా దిగిన పాత ఫొటోను అప్ లోడ్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్లలో ధోనీ కంటే ముందు శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర మాత్రమే ఉన్నాడు. వన్డేలో సంగా 14234 పరుగులు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adam gilchrist  dhawan  Dhoni Fifty  India  West Indies  kumara sangakkara  MS Dhoni  virat kohli  cricket  

Other Articles