invisible hand behind sunrisers winning ipl title

Invisible power supported sun risers winning ipl title

ipl 2016, ipl, ipl play-offs, ipl final, david warner, Bhuvaneshwar kumar, vvs kaxman, david warner srh, david warner hyderabad, srh david warner, srh vs gl, gujarat hyderabad, sunrisers Hyderabad, Gujarat Lions, SRH vs GL, hyderabad, Qualifier 2,IPL 9,Cricket latest IPL 9 news

SunRisers hyderabad bowler bhuvaneshwar kumar says invisible power supported their team from behing to win ipl title, who is non other than vvs laxman

అదృశ్య శక్తి ప్రోత్సాహంతోనే సన్ రైజర్స్ విజయం..

Posted: 05/30/2016 01:11 PM IST
Invisible power supported sun risers winning ipl title

సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ 9 టైటిల్ గెలుస్తుందని ఎవరెవరికీ నమ్మకం వున్నా లేకున్నా.. ఒక అదృశ్యశక్తికి మాత్రం పూర్తిగా నమ్మకం వుందని, ఆ శక్తి ప్రోత్భలంతోనే నిజానికి తాము టోర్నమెంటును గెలిచామని సన్ రైజర్స్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఐపీఎల్ ఫైనల్స్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన బెంగళూరు ఖచ్చితంగా ఈ టైటిల్ గెలుస్తుందని అందరూ ఊహించారు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివీలియర్స్, షేన్ వాట్సన్.. ఇలా ఒకళ్లకు మించి మరొక హిట్టర్లున్న ఆ జట్టును తలదన్నేవాడు ఎవడన్న ఊహ కూడా ఎవరికీ లేదు.

కానీ ఒక అదృశ్య శక్తి మాత్రం సన్‌రైజర్స్ శక్తి మీద నమ్మకం ఉంచింది. నిరంతరం వారిని వెన్నంటి ఉంటూ ధైర్యం నూరిపోసింది. ఏ దశలోనైనా జట్టు బలాన్ని నమ్ముకోవాలి తప్ప అవతలి జట్టును అతిగా ఊహించుకుని భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆ అదృశ్య శక్తే సన్ రైజర్స్ జట్టు మెంటార్ వెరీ వెరీ స్పెషల్.. వీవీఎస్ లక్ష్మణ్. అవును.. జట్టు మెంటార్‌గా ఉన్న లక్ష్మణ్ ప్రతి క్షణం జట్టుకు కావల్సిన నైతిక స్థైర్యాన్ని అందించాడు.

ఇదే విషయాన్ని కప్పు గెలిచిన తర్వాత సన్‌ రైజర్స్ కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో రన్‌రేటును గణనీయంగా తగ్గించడంలో స్పెషలిస్టుగా మారిన భువీ.. తమకు అదృశ్యశక్తిగా మద్దతు ఇచ్చిన లక్ష్మణ్‌కు థాంక్స్ చెప్పాడు. ఆయన చాలా కీలకంగా పనిచేశారని, తెరవెనుక ఆయన చేసిన కృషివల్లే తెరముందు తాము బాగా ఆడగలిగామని, తమకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అని ట్వీట్ చేశాడు. మొత్తమ్మీద అదృశ్య శక్తిగా మారిన లక్ష్మణ్.. సన్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  David Warner  Sunrisers Hyderabad  IPL final  Bhuvaneshwar kumar  vvs kaxman  

Other Articles