Jordan holds nerves, RCB steal one-run win over Kings XI Punjab

Rcb sneaks in 1 run win after vijay s fall

India, Indian Premier League, Indian Premier League 2016, IPL, IPL 2016, Cricket News, Kings Punjab won, Royal Challenger Bangalore, Murali Vijay, virat kohli, IPL 2016, IPL 9, Cricket

AB de Villiers plundered 64 runs in a 35-ball display of masterful batting, after Royal Challengers Bangalore slumped to 67 for 3 against Kings XI Punjab in Mohali.

ఉత్కంఠకరపోరులో బెంగళూరు ఒక్క పరుగు విజయం

Posted: 05/10/2016 05:40 PM IST
Rcb sneaks in 1 run win after vijay s fall

ఉత్కంఠభరితంగా సాగుతోన్న ఐపీఎల్ 9లో మరో 'ఒక్క పరుగు' విజయం నమోదయింది. పీసీఏ స్టేడియం వేదికగా ఆతిథ్య కింగ్స్ లెవెన్ జాబ్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. కింగ్స్ కెప్టెన్ మురళీ విజయ్ సూపర్ ఇన్నింగ్స్ 89 (57 బంతుల్లో  12 ఫోర్లు, ఒక సిక్సర్) ఆడినప్పటికీ ఆ జట్టు విజయం ముంగిట బొక్కబోర్లాపడి పాయింట్ల పట్టికలో చివరిస్థానానికే పరిమితమైంది.

బెంగళూరు విసిరిన 176 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. మురళీ విజయ్ కి ఓపెనర్ హషీమ్ ఆమ్లా (21) చక్కటి సహకారం అందించాడు. మిల్లర్ డకౌట్, విజయ్ నిష్క్రమణ తర్వాత కష్టాల్లో పడ్డ పంజాబ్ ను మార్కస్ స్కోయినిస్ (34 పరుగులతో) ఆదుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లలో వాట్సన్, చాహల్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. వాట్సన్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

తొలుత టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో బెంగళూరును  ఆరు వికెట్లు కోల్పోయి 175 పరుగులు సాధించింది. ఓపెనర్లు విరాట్ కొహ్లీ( 21 బంతుల్లో 20) కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా.. కేఎల్ రాహుల్(25 బంతుల్లో 42) వేగంగా ఆడి తొలుత బెంగళూరుకు శుభారంబాన్నిచ్చాడు. అనంతరం ఏబీ డివిలియర్స్ కేవలం 35 బంతుల్లోనే 64 పరుగులు సాధించడంతో బెంగళూరు బారీ స్కోరు దిశగా కదిలింది. చివర్లో సచిన్ బేబి(29 బంతుల్లో 33 పరుగులు) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, కరియప్పలకు రెండేసి వికెట్లు దక్కగా.. ఏఆర్  పాటిల్కు ఒక వికెట్ దక్కింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  Kings Punjab won  Royal Challenger Bangalore  Murali Vijay  virat kohli  Cricket  

Other Articles