నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టు లో టీమిండియా విజయభేరి మ్రోగించింది. టీ-ట్వంటీ, వన్డే సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిని చవిచూసిన టీమిండియా.. అసలైన క్రికెట్ కు బాష్పం చెప్పే టెస్టు సీరిస్ లో ప్రతీకారం తీర్చుకుంది. గాంధీ-మండేలా సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ, వన్డే సిరీస్‌లను కోల్పోయిన భారత్..దక్షిణాఫ్రికాతో జరుగుతున్ననాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 కైవసం చేసుకుంది. మూడవ టెస్టులో భారత్ దక్షిణాప్రికాపై పరుగుల విజయాన్ని సాధించింది.
32/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 124 పరుగులతో ఘనవిజయాన్నిసాధించింది. ఆమ్లా, డుప్లెసిస్ కొద్ది సేపు ప్రతిఘటించినా మిగతా బ్యాట్స్‌మెన్లు పెద్దగా పోరాడలేకపోవడంతో భారత్ మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్‌ను ముగించేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 7, మిశ్రా 3 వికెట్లు పడగొట్టారు. మొహలీ, నాగ్‌పూర్ మ్యాచ్‌లలో భారత్ గెలవగా బెంగళూరులో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మొదటి టెస్టుల తరహాలోనే మూడో టెస్ట్ లోనూ ఇరు వైపులా స్పిన్నర్ల హవా కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగోట్టిన రవిచంద్రన్ అశ్విన్ కు మ్యాన్ అప్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టీమిండియా స్కోరు:
తొలి ఇన్నింగ్స్ 215 పరుగలు
రెండో ఇన్నింగ్స్ 173 పరుగులు
దక్షిణాప్రికా స్కోరు:
తొలి ఇన్నింగ్స్ 79 పరుగలు
రెండో ఇన్నింగ్స్ 185 పరుగులు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more