Aggressive Virat Kohli refuses to be stubborn about team selection

We have no set combination for our team virat kohli

virat Kohli, Amit Mishra, AB de Villiers, Ravindra Jadeja, Stuart Binny, set of combination, allrounders, India Test captain Virat Kohli, india vs south africa third test, ind vs sa, indVSsa nagpur test, cricket, India, latest cricket news

India lead the four-match series 1-0 after the washout in Bangalore, and now both teams head to Nagpur for the third Test starting on November 25.

టీమిండియాలో సరైన కాంబినేషన్ ఇంకా కుదరలేదన్న కోహ్లీ

Posted: 11/20/2015 06:47 PM IST
We have no set combination for our team virat kohli

టీమిండియా క్రికెట్ జట్టులో ఇంకా సరైన కాంబినేషన్ కుదరలేదని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అందువల్లే జట్టులో రకరకాల ప్రయోగాలు చేయాల్సి వస్తుందన్నాడు.  ఈ క్రమంలోనే ఆటగాళ్లు జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడాల్సి వస్తుందన్నాడు. తొలి టెస్టులో సఫారీల దూకుడు అమిత్ మిశ్రా తన బంతులతో కళ్లెం వేసినా..  తదుపరి రెండో టెస్టుకు ఆడించకపోవడంపై విరాట్ స్పందించాడు. 'పరిస్థితుల్ని బట్టి జట్టును  ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేగానీ ఫలనా వారిని జట్టుకు ఎంపిక చేయాలని మూర్ఖంగా వ్యవహరించలేమని అన్నారు.
 
గత కొన్ని సంవత్సరాల నుంచి అమిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని కితాబిచ్చారు. అయితే జట్టు అవసరాల దృష్ట్యా ఆయనకు బదులుగా అల్ రౌండర్లు రవీంద్రజెడజాను, స్టువర్ట్ బిన్ని అవసరం ఉందని సెలెక్టర్లు భావిస్తే.. ఆ పరిస్థితిని మిశ్రా అర్ధం చేసుకుంటాడని అభిప్రాయపడ్డారు. ఒకేసారి ఇద్దరు ఆల్ రౌండర్లను ఆడించకూడదనే నిబంధన ఏమీ లేదన్నారు. ఇంకా జట్టులో సరైన కాంబినేషన్ అంటూ సెట్ కాలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ఆటగాళ్లు వారి ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఓ రకంగా  జట్టుకు ఉపయోగపడుతుంది' అని కోహ్లి అశాభావం వ్యక్తం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat Kohli  Amit Mishra  nagpur test  set of combination  allrounders  

Other Articles