India vs South Africa, 2nd Test Day One LIVE: Spinners, openers put India in command

South africa under pressure in second test against india

AB de Villiers, Bangalore, Bengaluru, Cheteshwar Pujara, Cricket, Dale Steyn, Gurkeerat Singh, Hashim Amla, India, India Vs South Africa, INDvSA, INDvSA Live, IndvsSA, Kohli, live, Live Cricket, Mohali, Murali Vijay, pitch, South Africa, South Africa in India 2015, Sports, SportsTracker, Test match, Vernon Philander, Virat Kohli

India - South Africa were bowled out for 214 in their first innings after tea on the opening day of the second Test against in Bangalore

సఫారీలను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా

Posted: 11/14/2015 06:38 PM IST
South africa under pressure in second test against india

భారత్, దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే టీమిండియా కట్టడి చేసింది. ఒక వైపు భారత స్పిన్నర్లు బాగా రాణించడంతో పాటు ఇటు ఓపెనర్లు కూడా రాణించడంతో రెండో టెస్టు తొలి రోజున టీమిండియా పైచేయి సాధించింది. టీమిండియా బౌలర్లు రాణించడంతో సఫారీలు 214 పరుగులకే పరిమితమయ్యారు. తొలి రోజు అట ముగిసే సమయానికి భారత ఎలాంటి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు సాధించి పటిష్ట స్థాయికి చేరుకుంది. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ 45 పరుగులతో, మరో ఓపెనర్ మురళీ విజయ్ 28 పరుగులతో కొనసాగుతున్నారు, టాస్ గెలిచి తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించిన టీమిండియా మరోసారి స్పిన్ మంత్రంతో అదరగొట్టింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును వందవ టెస్టు అడుతున్న విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ ఆదుకున్నాడు. 105 బంతుల్లో 85 పరుగులు చేసి గట్టెక్కించాడు. 11 ఫోర్లు, 1 సిక్స్‌తో డివిలియర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏబీ తర్వాత బ్యాట్‌కు దిగిన మిగతా బ్యాట్స్‌మెన్స్ కొద్ది పరుగులకే వికెట్లు సమర్పించుకున్నారు. టీ విరామానికి ముందు డివిలియర్స్ అవుట్ కావడంతో టీమిండియా శిబిరంలో ఆనందం వెల్లివిరిచింది. ఆ తరువాత సౌతాఫ్రికా టెయిల్ ఎండర్స్ ను భారత స్పిన్నర్లు వెనువెంటనే పెవీలియన్ కు పంపారు. 214 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్ లు తలో నాలుగు వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించారు. పేస్ విభాగంలో వరుణ్ ఆరోన్ ఒక వికెట్ దక్కింది.
 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Vs South Africa  bengaluru test  chinaswamy stadium  india  virat kohli  

Other Articles