Bhajji and Geeta's marry-go-round takes a new twist

Geeta basra harbhajan not getting married in oct

harbajan singh marriage, harbajan and geeta basra marriage,Geeta Basra- Harbhajan not getting married in October, Bhajji and Geeta's marriage takes a new twist, bajji marriage date not fixed, india cricket, cricket india, bcci, bcci india, bcci cricket, cricket bcci, cricket news, cricket

Actress says she will tie the knot on October 29, source close to the cricketer says no date has not been fixed. not even booked a venue.Even the wedding cards have not been printed. It could happen in December or next year.Nothing is finalised yet

హర్భజన్, గీతా బస్రా పెళ్లికి మరో ట్విస్ట్

Posted: 09/12/2015 06:28 PM IST
Geeta basra harbhajan not getting married in oct

భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బస్రా వివాహంలో మరో ట్విస్ట్ ఏర్పడింది. అక్టోబర్ 29న తనకు హర్భజన్ సింగ్ తాళి కడతాడని వధువు నటి గీతా బాస్రా చెబుతుంటే.. వరుడు హర్బజన్ సింగ్ సన్నిహత వర్గాల నుంచి మాత్రం ఇప్పటికీ ఆలాంటి వార్తలేమీ వెలువడటం లేదు. దీంతో వీరిద్దరి వివాహం వాయిదా పడినట్టు వార్తలు అందుతున్నాయి. అక్టోబర్ 29న ఢిల్లీలో పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమ జంట ఇటీవల నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే హర్భజన్ సింగ్ సన్నిహితుడు ఈ వార్తను తోసిపుచ్చాడు. భజ్జీ, బస్రాల పెళ్లి అక్టోబర్లో ఉండదని చెప్పాడు.

'హర్భజన్, అతని కుటుంబం వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదని తెలిపాడు. అంతేకాదు భజ్జి కుటుంబ సభ్యులు వివాహ వేదికను కూడా బుక్ చేయలేదన్నారు. అంతేకాదు కనీసం వివాహ ఆహ్వాన పత్రికలు కూడా కొనుగోలు చేయలేదని చెప్పుకోచ్చారు. దీంతో భజ్జి వివాహం డిసెంబర్ మాసంలో జరగవచ్చునని లేదా 2016లో జరగవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. నవంబర్ 2 నుంచి హర్భజన్ క్రికెట్ సిరీస్లో పాల్గొంటున్నాడు. దీంతో సిరీస్ ముగిసేవరకు తాను వివాహం చేసుకోవడం కుదరకపోవచ్చునని చెప్పాడు. అయితే పెళ్లి విషయంలో హర్భజన్ కుటుంబసభ్యులు ఇంకా ఏ విషయాన్ని ఖరారు చేయలేదు' అని భజ్జీ సన్నిహితుడు చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbajan singh  cricketer  geeta basra  actress  marriage  new twist  

Other Articles