priyanka is fan of football | not cricket says Raina

Marriage with priyanka is arranged says suresh raina

suresh raina to tie nuptial knot, Suresh Raina to wed childhood sweetheart, Suresh Raina to wed priyanka chowdhary, suresh raina engaged, indian middle ordered batsman suresh raina, cricker suresh raina marriage

The wedding ceremonies of star India cricketer Suresh Raina to held in Delhi today, ahead of nupitial lnot to scheduled today

బాల్య స్నేహితురాలే.. కానీ అమ్మ కుదిర్చిన సంబందమే..

Posted: 04/03/2015 08:01 PM IST
Marriage with priyanka is arranged says suresh raina

టీమిండియా స్టార్ క్రికెటర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా ఇవాళ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకా చౌదరిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయమై మాట్లాడుతూ తన కుటుంబంలో పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే తాను చేసుకుంటున్నానని చెప్పుకోచ్చాడు. ముఖ్యంగా రైనా తల్లి నిర్ణయించిన అమ్మాయిని మరో మాట మాట్లాడకుండా పెళ్లాడుతున్నానని చెప్పాడు. అయితే.. కాకాతాళీయంగా అమె తన చిన్ననాటి స్నేహితురాలు కావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోచ్చాడు.

నిరంతరం క్రికెట్లో మునిగి తేలే సురేష్ రైనాకు కాబోయే భార్య అయిన ప్రియాంకకు మాత్రం అసలు క్రికెట్ అంటే ఏంటో తెలియదు. ఈ విషయాన్ని స్వయంగా రైనాయే చెప్పాడు. తనకు క్రికెట్ గురించి పెద్దగా ఏమీతెలియదని, ఫుట్‌బాల్ అంటే పిచ్చి అని అన్నాడు. మెస్సీ, వాన్‌పెర్సీలకు ఆమె పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. తనను క్రికెటర్‌గా కాకుండా, ఓ వ్యక్తిగా ఇష్టపడినందుకు సంతోషంగా ఉందని కూడా రైనా తన సతీమణిని మెచ్చుకున్నాడు. పెళ్లి అయిన కొన్నాళ్లకే రైనా ఐపీఎల్లో బిజీబిజీగా తిరుగుతాడు. దాదాపు 45 రోజుల పాటు కొత్త పెళ్లి కొడుకు తన భార్యకు దూరంగానే ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆమె కూడా తన కెరీర్ కోసం వెళ్లిపోతుందట. తర్వాత ఇద్దరికీ తీరిక కుదిరినప్పుడు మాత్రం ఇటలీలో హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు రైనా వెల్లడించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Marriage  Team India  Suresh Raina  

Other Articles