Indian opener shikar dhawan fastest century

india versus ireland, india vs ireland, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, india, india CWC 2015, Live Scores, Live Updates, ireland, ireland CWC 2015, Sports, World Cup Live, shikar dhawan, rohit sharma, sachin tendulkar

Indian opener shikar dhawan fastest century against ireland, equals sachins record in worldcup

వేగంగా శతకొట్టిన శిఖార్.. సచిన్ రికార్డు సమం..

Posted: 03/10/2015 01:00 PM IST
Indian opener shikar dhawan fastest century

ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా గ్రూపు-బీలో హామిల్టన్ లో ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మరో ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్ కప్ టార్నమెంటులో భారత్ తరపున వేగంగా సెంచరీ సాధించిన రెండో అటగాడిగా నిలిచాడు. సరిగ్గా గతంలో ప్రపంచకప్ టోర్నీలో సచిన్ సాధించినట్లుగానే కేవలం 84 బంతుల్లో శిఖార్ సెంచరీ సాధించి.. సచిన్ రికార్డును సమం చేశాడు. 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో వంద పరుగుల మైలు రాయిని అధిగమించాడు.

కాగా వన్డేల్లో 8వ సెంచరీని సాధించిన శిఖార్ ధావన్ ఆతరువాత ఐర్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేస్తాడని అనుకున్న భారత క్రికెట్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. సెంచరీ సాధించిన తరువాత అదే స్కోరుపై ఆయన ఔటయ్యి పెవీలియన్ దారి పట్టాడు. మరోవైపు టీమిండియా ఓపెనర్లు శిఖార్ ధావన్, రోహిత్ శర్మలు మరో అరుదైన రికార్డును కూడా అధిగమించారు. ప్రపంచ కప్ లో వీరిద్దరి భాగస్వామ్యంలో తొలి విక్కెట్ కు 174 పరుగులు సాధించడం కూడా రికార్డుగా నిలిచింది. గతంలో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత ఓపెనర్లు సచిన్, అజయ్ జడేజాలు 163 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ రికార్డును టీమిండియా తరపున శిఖార్ ధావన్, రోహిత్ శర్మలు అధిగమించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  Ireland  shikar dhawan  sachin tendulkar  

Other Articles