India skipper mahendra singh dhoni becomes father

Dhoni becomes father, Mahendra Singh Dhoni becomes father, India skipper MS Dhoni becomes father, ms dhoni couple became parents, dhoni girl child, Indian skipper mahendra singh dhoni, MS Dhoni, sakshi singh rawat, icc world cup 2015, Sakshi Dhoni, cricket, World Cup Squad, World Cup Points Table, World Cup Schedule

India skipper Mahendra Singh Dhoni became a father after his wife Sakshi gave birth to a baby girl at a private hospital in Gurgaon.

ధోణి ఇంట.. శుక్రవారం పూట.. మహాలక్ష్మీ కటాక్షం.. సాక్షి గిఫ్ట్..

Posted: 02/07/2015 07:56 AM IST
India skipper mahendra singh dhoni becomes father

వన్డే ప్రపంచ కప్ ముందుగానే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆయన సతీమణి సాక్షి మర్చిపోలేని అందమైన బహుమతిని అందించింది. వరల్డ్ కప్ గెలుచుకున్నాక గిప్ట్ ఇస్తే అర్థముంది కానీ, ఇంకా ప్రపంచ కప్ టార్నమెంట్ ప్రారంభం కాకముందే గిఫ్ట్ ఇవ్వడమేం.టని అలోచిస్తున్నారా..? ఇది సాధారణ బహుమతి కాదండి.. అసాధారణ బహుమతి. మరో రకంగా చెప్పాలంటే దోణికి ప్రమోషన్ కల్పించింది సాక్షి. ఈ ప్రమోషన్ కెరీర్లో కాదండోయ్.. నిజ జీవితంలో. ధోనీ తండ్రయ్యాడు. శుక్రవారం రాత్రి ఇక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ధోనీ భార్య సాక్షి సింగ్ రావత్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  

ధోనీ, సాక్షి దంపతుల ఇంటి శుక్రవారం మహాలక్ష్మీ పుట్టింది. వారి జంటకు ఈ శిశువే మొదటి సంతానం. బిడ్డ బరువు 3.7 కిలోలు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. 2010లో ధోనీ సాక్షిని వివాహం చేసుకున్నాడు. ధోనీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం ధోనీ సమాయత్తం అవుతున్నాడు. కాగా ధోనీ తన ముద్దుల కుమార్తెను చూసేందుకు త్వరలో వీలు చూసుకుని భారత్కు వచ్చే అవకాశముంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  becomes father  Sakshi Singh Rawat  

Other Articles