No question of removing dhoni from captaincy says kapil dev

Kapil Dev, Mahendra Singh Dhoni, Dhoni from captaincy, removing Dhoni from captaincy, Former Indian captain Kapil Dev,

No question of removing Dhoni from captaincy says Kapil Dev

ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

Posted: 03/26/2014 01:11 PM IST
No question of removing dhoni from captaincy says kapil dev

కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనిని తప్పించే అవకాశాలే లేవని భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అన్నారు. ధోని సారథ్యంలోని భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ... విదేశాల్లో ఇటీవలి ప్రదర్శన దృష్ట్యా మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులను నియమించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ధోనికి కపిల్ మద్దతుగా నిలిచారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు. ‘ధోని ఆదర్శవంతమైన కెప్టెన్. అతని నాయకత్వ లక్షణాలపై సందేహాలు అనవసరం. రాబోయే టెస్టు సిరీస్‌లో తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాడు. 2015 వన్డే ప్రపంచకప్ భారత్‌కు అందించే సత్తా అతనికి ఉంది’అని కపిల్ చెప్పారు.  

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles