లడఖ్
జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సింధు నదీ తీరాన వున్న ఈ ప్రాంతానికి ‘ఆఖరి శాంగ్రిలా’ (ది లాస్ట్ శాంగ్రిలా), ‘చిట్టి టిబెట్’ (లిటిల్ టిబెట్), ‘చంద్ర ప్రదేశం’ (ది మూన్ ల్యాండ్), ‘విరిగిన చంద్రుడు’ (ది బ్రోకెన్ మూన్) అనే పేర్లు కూడా ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు.. తదితరాలు ఈ ఇక్కడి వుండే ఆకర్షణీయమైన ప్రదేశాలు.