సూర్య దేవాలయం
ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ లో ఈ అద్భుతమైన ఆలయం వుంది. ఈ సన్ టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. నిజానికి కోణార్క్ అనే పేరు కోణ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. కోణ అంటే కోణము అర్క అంటే సూర్యుడు. సూర్యుడికి అంకితమివ్వబడిన ఆలయంతో ఈ పేరు వచ్చింది.