హోటల్ డెల్ కొరొనాడో (Hotel Del Coronado)
శ్యాన్ డియోగోలో ఎంతో విలాసవంతంగా వున్న ఈ భవంతిని 1888లో నిర్మించడం జరిగింది. అయితే ఇందులో 1892లో ఒక మహిళ అనుమానాస్పదంగా మరణించింది. అప్పటినుంచి ఇప్పటికీ ఆ మర్డర్ మిస్టరీ తేలలేదు. దీంతో అక్కడ దెయ్యాలు సంచరిస్తున్నాయని.. వాటిని చూసిన నేపథ్యంలో ఆ అమ్మాయి మరణించిందనే పుకార్లు బయటకొచ్చాయి.