Legal advice for property law

legal advice for property law

legal advice for property law

legal advice for property law.png

Posted: 03/15/2013 02:29 PM IST
Legal advice for property law

lawనేను డిగ్రీ వరకు చదువుకొన్నాను. మా పెద్దలు వివా హం గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు, నేనొక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నేను ఉద్యోగం చేస్తున్న చోట, అక్కడ నాతో పని చేస్తున్న నా సహోద్యో గికి వివాహం జరిగిన 3 సంవత్సరాలకు అతని భార్య అతనితో కాని, అతని బంధువులతోకాని, కనీసం చుట్టు ప్రక్కల వాళ్లతోకాని చెప్పకుండా ఇల్లువిడిచి వెళ్ళి పోయినది. అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి వాళ్ళ బంధు వుల దగ్గర, చుట్టు ప్రక్కల విచా రణ జరిపి చివరకు మనశ్శాంతి లేక పిచ్చివాడిలాగా తిరుగుతూ నా సహ కారం కోరినాడు. అప్పుడు, అతని కోరికకు నేను అంగీ కరించాను. అతనితో పరిచయం ఎక్కువ కావడంతో అతను నన్ను భార్యగా స్వీకరించి నాడు. అప్పటినుండి మేమిద్దరం కలిసి ఐదు సంవత్స రాలు సుఖ సంతో షాలతో సంసార జీవితం సాగిస్తుం డగా ఒక సంవత్సరం క్రిందట ఒక కుమారుడు జన్మిం చాడు. పుట్టిన ఆరు నెలల తరువాత అతని మొదటి భార్య రావడంతో మాలో గొడవలు మొదలైనవి. అప్పు డు, నా భర్త నాకు ఇన్ని రోజులు సంసారం చేసినందుకు రెండు ఎకరాల వ్యవ సాయ భూమిని దానం క్రింద ఇచ్చి, రిజిష్టరు చేసాడు, కాని నా కొడుకును వాళ్ళిద్దరు పోషించుకుంటామని వాళ్ళే తీసుకొన్నారు. ఇప్పుడు ఆ ఆస్తి నేను చనిపోతే ఎవరికి చెందుతుంది. నా కొడుకు జీవితం గురించి తండ్రికి అధికారం ఉందా, అలాగే నా భర్తపై ఏ భార్యకు హక్కుకలదు. దయచేసి న్యాయ సలహా ఇవ్వగలరు.


మీరు చేసుకొన్న వివాహం, సంసారం, సుఖ సంతోషా లు అన్ని కూడా చట్ట విరుద్ధం. మీరు చదువుకున్న వారే కానీ, మీరు చేసింది కరెక్టు కాదు. అంతేకాదు బిడ్డకు జన్మనిచ్చి, అనాధగా వదలడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆ పిల్లవాడి గురించి ఆలోచించడం మంచిదికాదు. మీలాంటి అమాయకులను అలాం టి మగవాళ్ళు మోసం చేస్తూనేవుంటారు. అయినా మీరు చేసింది చట్టప్రకారం అంగీకారం కానేరదు. ఇక అసలు విషయానికి వస్తే... హిందూ స్ర్తీ పేరున వున్న ఆస్తి కావున, హిందూ వారసత్వం ప్రకారం ఆ ఆస్తి ఎక్కడ నుంచి వచ్చినా, ఎలా వచ్చినా స్ర్తీ ఆస్తి వారసత్వం అంటారు. మీరు ఎలాంటి గిఫ్ట్‌లుకాని, వీలునామాగాని, ఇతర అగ్రిమెంట్‌గాని, రాయకుండా ఎవరికి ఎలాంటి సంతకాలు పెట్టకుండా చనిపోయి నట్లతే అట్టి ఆస్తి మీ కుమారుడుని వాళ్ళు పోషిస్తు న్నంత మాత్రాన నీ కొడుకు కాకుండా పోడు. కావున ఆ ఆస్తికి వారసుడు (హక్కుదారుడు). అలాగని మీ కుమారుడుని ఎలాంటి ఋజువు లేకుండా అనగా రేషన్‌కార్డు కాని, ప్రభుత్వ సంబందిత పత్రంలో కాని, వాటి ద్వారా మీ కుమారుడు అని ఋజువు చేసుకోవలెను.

అలా చేసుకోని (ఋజువు) పక్షంలో ఆ ఆస్తిపై మీ కుమారునికి ఎలాంటి హక్కు ఉండదు. అప్పుడు మీ తల్లి, తండ్రీ, తల్లిదండ్రుల యొక్క వారసులకు చెందును. అంతేకాని మీ భర్తకు మీ ఆస్తిపై హక్కు లేదు. అలాగని చట్ట ప్రకారం మీ కొడుకు అని ఋజువు చేసినా, మీ కంటే ముందే మీ కొడుకు చనిపోయినా, అలాంటి ఆస్తులు మీ వారసులు, అనగా మీ యొక్క తల్లి, తండ్రీ, వారి తల్లితండ్రులకు కాని చెందును. ఒకవేళ వాళ్ళు కూడా చనిపోయి ఉంటే మీ తదనంతరం ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుం టుంది. అలా కాకుండా మీ పుత్రుడు, మీ తల్లితం డ్రులు లేని పక్షంలో అలాంటి భూమిని ఒక ట్రస్ట్‌ క్రింద రాయవలసింది. అదే విధంగా మీ భర్తపై మీకెలాంటి అధికారం లేదు. ముందుగా మీ భర్త దగ్గర చట్ట ప్రకారం వివాహం చేసుకొని తరువాత చెప్పపెట్ట కుండా పోయినా, దాని తరువాత ఐదు లేక ఆరు సంవత్సరాల తరువాత వచ్చినా, ఎప్పుడువచ్చినా, మొదటి భార్యకే హక్కు కలదు. ఎందుకనగా ఆమె ఇంటి నుండి వెళ్ళిన తరువాత కాని, ఎక్కడ, ఎప్పుడు చట్ట ప్రకారం విడాకులు తీసుకోలేదు. కావున ఆమె ఇంట్లోనుండి వెళ్ళిపోయినంత మాత్రాన ఆమె భార్యగా అధికారం కోల్పోలేదు. పెళ్ళి చేసే అధికారం అందరికి కలదు కాని, బంధుత్వం విడిపోమని చెప్పే అధికారం ఎవరికి లేదు. కేవలం న్యాయ స్థానాలకు తప్ప. మీ కుమారుని ఆలన, పాలన, చదువు హక్కులు. అన్ని కూడా వాళ్ళ నాన్న ద్వారా పొందవచ్చును.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Share in the property of the first wife
Debitor died  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles