How to dividing joint family properties

29.1.png

Posted: 08/17/2012 02:58 PM IST
How to dividing joint family properties

joint_family_properties

Propertyఉమ్మడి కుటుంబ ఆస్తి పంపకం అమలులోనికి వచ్చిన తర్వాత... ఉమ్మడి కుటుంబానికి చెందిన ఒక హిందూ పురుషుడు మరణించినప్పుడు ఆ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తిలో అతనికి గల హక్కు (వాటా) ఉమ్మడి కుటుంబంలో మిగిలిన సహ బాగస్థులకు సంక్రమిస్తుందే తప్ప ఈ చట్టం వర్తించదు. అయితే సదరు చనిపోయిన వారికి ఒక స్ర్తీ వారసురాలై ఉండవచ్చు లేక అమె మగ సంతతి ఉండి ఉండవచ్చు. ఆస్తి కనుక ఈ చట్టము చివర పొందుపరచబడిన మొదటి షెడ్యూల్‌లో ఉదహరించబడిన ప్రథమశ్రేణి వారసుల జాబితకు చెందిన స్ర్తీ అయినట్టయితే సదరు చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్థి సంక్రమణం ఈ చట్ట ప్రకారం జరుగుతుంది తప్ప ఆ వ్యక్తి మరణ శాసనం వ్రాశాడా, లేదా అన్న అంశం ఆధారంగా) సహ బాగస్థుల సిద్దాంతం వర్తించదు.

ఈ సెక్షన్‌కు సంబంధించి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో భాగం అంటే ఒక వ్యక్తి చనిపోకముందు భాగ పంపిణి జరిగి ఉంటే ఆ వ్యక్తికి ఎంత వాటా లభించి ఉండెదో, అదే అతని భాగం అని అర్థము. ఆ విషయంలో భాగ పంపకాలను కోరే హక్కు, ఆధికారం ఆ వ్యక్తికి ఉన్నదా, లేదా అన్నది అప్రస్తుతం. ఒక బాగస్థుడు చనిపోకముందే మిగిలిన సహ బాగస్థులలో ఎవరైనా తన వాటా పంచుకుని ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వెళ్ళిపోతే ఆ తరువాత చనిపోయిన వ్యక్తి యొక్క వాటాలో ఆ వ్యక్తికి గాని అతని వారసులకు గాని, ఎటువంటి హక్కు లభించదు. మన హిందూ ధర్మశాస్త్రం పరిశీలిసేై మహిళలకు ఎంత అన్యాయం చేసింది సులభంగానే అర్థం అవుతుంది.

ఎంత పక్షపాతంతో కూడినదో తెలుస్తుంది. స్వంత లేక స్వార్జితపు ఆస్తి విషయములో స్ర్తీ పురుష విచక్షణ లేకుండా అందరికీ సమాన హక్కులతో సమానంగా వాటా లభిస్తుందని ఈ చట్టం ఒక వంక పేర్కొంటూనే, మరో ప్రక్క ఉమ్మడి కుటుంబ ఆస్తి విషయంలో మాత్రం ఈ చట్టం వర్తించదని, కేవలం సహ బాగస్థులకే సదరు ఆస్తి సంక్రమిస్తుందని ఆ సెక్షన్‌లో పేర్కొనటం జరిగింది. తల్లి, తోబుట్టువులు, భార్యతో సహ మహిళలేవరూ సహ బాగస్తులు కారు కనుక వారికి ఏ విధమైన ఆస్తి సంక్రమించదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మూడుపువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లిన రోజులలో మను ధర్మశాస్త్రం పునాదిగా గల ఆ సిద్దాంతం చెల్లుబాటు అయింది. స్ర్తీని ఒక పశువులాగానో, వస్తువుగానో దానం చేసే రోజులవి.

వివాహ క్రతువులో కన్యాదానానికి మూలధారము ఈ సిద్దాంతమే... ఇప్పటికీ వివాహంలో కన్యదాన క్రతువు కొనగాగుతూ, ఆర్థము పోయి ఒక తంతుగా మిగిలి పోయింది. అయితే కాలం మారింది. యుగ ధర్మాలు మారుతున్నాయి. కాలనుగుణంగా హిందూ ధర్మ శాస్త్రాలు కొంత వరకు మారాయి. సామాజిక సంబంధాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మారాయి. తొలుత కొంత ప్రతిఘటన ఎదురైనా, బాల్యవివాహలు రద్దు అయ్యాయి. వితంతవుకు శిరోమండనం, తెల్ల వస్తధ్రారణ వంటి వాటికి తెరపడింది. వితంతు వివాహాలు సర్వసాధారణమయ్యాయి. స్ర్తీలు చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం, చట్టసభలకు ఎన్నిక కావటం జరుగుతున్నది. ఇవన్నీ పురుషాధిపత్యానికి గండి కొట్టెవే అయినా, ఆర్థికంగా పురుషాధిపత్యానికి కుటుంబ ఆస్తిలో వారి హక్కులపై ప్రభావం చూపలేదు.

కనుక పురుషులు సహించరు. ఆ మేరకు హిందూ ధర్మ శాస్త్రానికి సవరణలకు అంగీకరించినా, ఆస్తికి సంబంధించి తమ హక్కులు వదులుకోవటానికి మాత్రం వారు సిద్ధం కాలేదు. చట్ట సవరణకూ ఆంగీకరించలేదు. అందుకే మహిళలకు ఉమ్మడి కుటుంబ ఆస్తిలో ఎటువంటి హక్కులను కల్పించని ఆ సెక్షన్‌ ఇంతకాలం కొనసాగింది. ఏమైతేనేం ఇంతకాలానికి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మహిళలకూ సమాన హక్కులు సంక్రమించాయి. ఇది నిజంగా అభ్యుదయ శక్తులకు ఒక విజయమే. ఈ చిన్న మార్పుకు ఇంతకాలం పట్టిందంటే మొత్తం పురుషాధిపత్యానికి తెరపడి, స్ర్తీ పురుష సమానత్వం రావాలంటే మరింతగా పొరాడాలి.ఉమ్మడి కుటుంబ ఆస్తిలో హిందూ మహిళకు వాటా(హక్కు) కల్పించకపోవటం లింగ వివక్షతకు నిదర్శనమని అంతే కాకుండా భారత రాజ్యాంగం ద్వారా పేదలకు సంక్రమించిన సమానత్వం అదే ప్రాథమిక హక్కుకు విరుద్దమని, అందువలన ఈ లింగ వివక్షణను రూపుమాపి, హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కుమారులతో బాటు కుమార్తెలకు కూడా సమాన హక్కులు కల్పించటం ద్వారా మహిళలకు చట్ట సమానత్వం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సెక్షన్‌ను సమూలంగా మార్చినట్లు ఈ చట్ట సవరణకు సంబంధించిన ముందు మాటలో ప్రభుత్వం పెర్కొన్నది. అయితే ఈ వాస్తవం ప్రభుత్వానికి తెలియటానికి దాదాపు అరవై సంవత్సరాలు ఎందుకు పట్టిందన్నదే అసలు ప్రశ్న నిజానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో ముందు ఉన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Discuss problems in land
Bombay high court says chastity is not held property  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles