Manohararao https://mail.teluguwishesh.com Sun, 28 Apr 2024 09:14:04 +0530 Joomla! - Open Source Content Management en-gb Telugu Content https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98800-om-raut-defends-saif-s-ravana-look-in-adipurush-%E2%80%98this-is-how-demons-look-today%E2%80%99.html https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98800-om-raut-defends-saif-s-ravana-look-in-adipurush-%E2%80%98this-is-how-demons-look-today%E2%80%99.html

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్ డిజాస్టర్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. కాగా, రెబెల్ స్టార్ నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్' పైనే అభిమానులు అన్ని అశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్.. యానిమేషన్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో అభిమానులు హర్ట్ అయ్యారు.

ఫాన్స్ విషయాన్ని పక్కనబెడితే.. ఈ చిత్ర టీజర్ వీక్షించిన పలు వర్గాలు చిత్ర దర్శకుడు ఓం రౌత్ పై కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఈ టీజర్ చూసి చాలా మంది పెదవి విరువగా.. అనేకమంది చిత్రంలోని వేషాధారణను వ్యతిరేకించారు. హిందువుల ఆరాధ్యదేవుడు శ్రీరాముడి.. రామాయణ గాధను ఇతివృతంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో తమ భావాలను గాయపర్చేలా రూపోందించారని విమర్శలు మొదలయ్యాయి. మరీముఖ్యంగా రావణుడి గెటప్ ను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించారు.

ఆదిపురుష్ చిత్ర టీజర్ లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని.. చిన్ని వీడియోను చూసి ఒక అంచనాకు రావద్దని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల అవుతుందని... సినిమా చూసిన వారెవరూ నిరాశ చెందరని చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని అన్నారు. ప్రభాస్ కోసమే రాముడి పాత్రను రాశానని... కథ రాస్తున్నంత సేపు తన మైండ్ లో ప్రభాసే ఉన్నాడని చెప్పారు. ప్రభాస్ కోసం ఈ సినిమాను తెరకెక్కించానని.. ప్రభాస్ నో చెప్పి ఉంటే సినిమా చేసే వాడిని కాదని అన్నారు. ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని చెప్పారు.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 19:51:27 +0530
Telugu Content https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98799-vennela-kishore-as-mysore-bujji-from-manchu-vishnus-ginna.html https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98799-vennela-kishore-as-mysore-bujji-from-manchu-vishnus-ginna.html

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు. రాజబాబు, రేలంగి, పద్మనాభం నుంచి అల్లు రామలింగయ్య, సుత్తి బద్రర్స్.. అక్కడి నుంచి ఏవీఎస్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వరకు అందరి నుంచి హాస్యాన్ని.. కాదు కాదు.. నవ్వించే తత్వాన్ని అందిపుచ్చుకుని ప్రస్తుతం సినీమాల్లో తనదైన ముద్రవేసుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో వెన్నల కిషోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. సినీపరిశ్రమను ఏలిన ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, ఆహుతి ప్రసాద్ ఇలా కమేడియన్లు వరుసగా నవ్వుల్ని పంచి.. అవే జ్ఞాపకాలను మిగిల్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లగా.. అలాంటి సమయంలో నవ్వించే బాధ్యతలను తనపై వేసుకున్న వెన్నెల కిశోర్ ప్రేక్షకుల మనన్నలను పోందుతున్నాడు. తాజాగా ఆయన 'జిన్నా' సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేశాడు. ఈ సినిమాలో ఆయన 'మైసూర్ బజ్జీ' పాత్రలో కనిపించనున్నాడు.

వెన్నల కిషోర్ పాత్రను పరిచయం చేస్తూ .. ఆయన ఫస్టులుక్ పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆయన పాత్రలో కామెడీతో పాటు కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందనే విషయం ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. సొంత బ్యానర్ పై విష్ణు నిర్మించిన ఈ సినిమాకి, జి.నాగేశ్వరరెడ్డి కథను అందించగా .. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చాడు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే జనంలోకి వెళ్లాయి.  పాయల్ - సన్నీలియోన్ అందాల సందడి చేసిన ఈ సినిమా, తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 18:51:57 +0530
Telugu Content https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98798-megastar-chiranjeevi-thanked-salman-khan,-fans-for-godfather-s-success.html https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98798-megastar-chiranjeevi-thanked-salman-khan,-fans-for-godfather-s-success.html

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్ రోల్ పోషించాడు. నిన్ననే సల్మాన్ ఖాన్ 'గాడ్ ఫాదర్' సక్సెస్ పట్ల చిరంజీవికి శుభకాంక్షలు తెలిపారు. "మైడియర్ చిరు గారూ ఐలవ్యూ" అంటూ ఓ వీడియో సందేశం పంపారు.

తాజాగా చిరంజీవి ఓ వీడియోతో సల్మాన్ ఖాన్ కు బదులిచ్చారు. "థాంక్యూ మైడియర్ సల్లూ భాయ్" అంటూ స్పందించారు. "మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, గాడ్ ఫాదర్ అద్భుత విజయం వెనుక 'మసూద్ భాయ్' ఒక శక్తిలా నిలిచాడు" అంటూ చిరంజీవి కొనియాడారు. "థాంక్యూ... లవ్యూ సోమచ్.. వందేమాతరమ్" అంటూ తన వీడియోలో పేర్కొన్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మోహ‌న్ రాజా మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.

చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో న‌య‌న‌తార‌, ప్ర‌తినాయ‌క పాత్ర‌లో స‌త్య‌దేవ్ ఆక‌ట్టుకున్నారు. బాలీవుడ్ బ‌డా హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర పోషించారు. దీంతో ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు హిందీలో కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. బాలీవుడ్‌లో సైతం ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రేక్ష‌కుల స్పంద‌న నేప‌థ్యంలో హిందీలో గాడ్ ఫాద‌ర్ కి ఒక్కసారిగా 600  స్క్రీన్లు పెంచారు. ఈ విష‌యాన్ని చిరంజీవి వెల్ల‌డించారు. త‌న చిత్రానికి ఇంత మంచి విజ‌యం క‌ట్ట‌బెట్టిన ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను ట్విట్ట‌ర్ లో  షేర్ చేశారు. 

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 17:52:11 +0530
Telugu Content https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98797-ponniyin-selvan-mani-ratnam%E2%80%99s-film-breaks-more-international-records%2C-nears-rs-350-crore-worldwide.html https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98797-ponniyin-selvan-mani-ratnam%E2%80%99s-film-breaks-more-international-records%2C-nears-rs-350-crore-worldwide.html

ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం 'పొన్నియిన్ సెల్వన్ 1' గత నెల 30న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. పలు అంతర్జాతీయ చిత్రాలు నెలకొల్పిన రికార్డులను బద్దలుకొడుతూ బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్లు సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన ఎనమిది రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.

ఇంతటి భారీ వసూళ్లు రాబట్టడం పలు అంతర్జాతీయ చిత్రాల ట్రాక్ రికార్డులు బద్దలయ్యాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 'పీఎస్‌1' తొలి వారంలో అద్భుత‌మైన బిజినెస్ చేసింది. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా తమిళ్‌, హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుద‌లైన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే రూ. 325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విష‌యాన్ని ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ ధృవీకరించారు. ఈ వారాంతంలో రూ. 350 కోట్ల మార్క్ దాటుతుంద‌ని అంచ‌నా వేశారు.

'రోబో 2.0', 'కబాలి', 'బిగిల్', 'విక్రమ్' తర్వాత రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన ఆరో తమిళ సినిమా ఇదేనని త్రినాథ్ తెలిపారు. 'కబాలి', 'రోబో 2.0' ఓవ‌రాల్‌ బాక్సాఫీస్ కలెక్షన్లను అధిగమించిన ఈ చిత్రం 'విక్ర‌మ్' రికార్డును కూడా బ్రేక్ చేసే దిశ‌గా ముందుకెళ్తోంది. విదేశాల్లోనూ 'పీఎస్‌1' హ‌వా కొన‌సాగుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం 5 మిలియ‌న్ల క్ల‌బ్‌లో చేరింది. ర‌జ‌నీకాంత్ 'రోబో 2.0' చిత్రం త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన రెండో త‌మిళ మూవీగా నిలిచింది.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 16:52:44 +0530
Telugu Content https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98796-ori-devuda-trailer-venkatesh,-vishwak-sen-film-is-a-story-about-second-chances.html https://mail.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98796-ori-devuda-trailer-venkatesh,-vishwak-sen-film-is-a-story-about-second-chances.html

తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో విష్వక్సేన్ ఆయా చిత్రాల ప్రమోషన్ వర్క్ కోసం కూడా తెగ కష్టపడతాడు. అలా గత చిత్ర ప్రమోషన్ వర్క్ లోనే ఆయన కాసింత కాంట్రవర్సీకి కారణమయ్యాడు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. విక్టరీ వెంకటేశ్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు.

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపోందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. దీపావళి కానుకగా ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం తరువాత కన్నడ భాషల్లో రీమేక్ గా తెరకక్కిన ఈ కథ శాండిల్ వుడ్ ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించే విధంగా చిత్రం రూపోందినట్లు.. అందునా విక్టరీ వెంకటేశ్ ఉన్నారని తెలియగానే మినిమమ్ గ్యారెంటీ వచ్చేసినట్టేనని తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓరి దేవుడా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే ఏకంగా 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టి, ట్రెండింగులో నెంబర్ వన్ గా నిలిచింది. జీవితంలో వరుస కష్టాలు ఎదురైనప్పుడు 'ఓరి దేవుడా' ఇవెక్కడి కష్టాలురా నాయనా అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక అవకాశాన్ని చేజారిన సందర్భంలో భగవంతుడు మరొక్క ఛాన్స్ ఇస్తే బాగుండునే అనుకోవడం జరుగుతుంది. ఈ రెండు అంశాల చుట్టూనే తిరిగే కథ ఇది. తెలుగులోను ఈ కథకి ఆదరణ లభిస్తుందేమో చూడాలి.

{youtube}v=x4-7tqS1h_Q|620|400|1{/youtube}

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 15:51:47 +0530
Telugu Content https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98795-ola-electric-scooter-turns-saviour-as-lights-go-out-during-navratri-celebrations.html https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98795-ola-electric-scooter-turns-saviour-as-lights-go-out-during-navratri-celebrations.html

అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది. ఎలా అందరిలోనూ నిరుత్సాహం. ఇంతలో ఒకరికి మంచి ఐడియా వచ్చింది. ఇటీవలే కొన్న తన కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను అక్కడికి తెచ్చేశారు. ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసి స్కూటర్ లోని స్పీకర్ లకు కనెక్ట్ చేసి పాటలు పెట్టారు. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో బ్యాటరీ చార్జింగ్ అయి ఉంది. ఇంకేం స్కూటర్ లో-లైట్ ను ఆన్ చేసి వెలుతురు పెట్టుకున్నారు. స్పీకర్లలో పాటలు పెట్టుకున్నారు. ఆడా మగా అంతా కలిసి వలయంలా ఏర్పడి తిరుగుతూ గర్భానృత్యం చేశారు. అయితే పవర్ కట్ తో పూర్తి చీకటిగా మారింది. దీంతో.. ఆ వీడియో కాస్త మసకగా వచ్చింది. శ్రేయాస్‌ సర్దేశాయ్‌ పేరిట ఉన్న ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేయగా వైరల్‌ అయింది. 47 వేలకుపైగా వ్యూస్‌ రాగా.. వందలకొద్దీ లైకులు కూడా వచ్చాయి. ‘‘నవరాత్రి ఉత్సవాల సమయంలో కరెంటు పోతే ఓలా ఎస్‌1 ప్రో ఆదుకుంది. ఓలా స్కూటర్‌ లోని స్పీకర్లు అవసరానికి బాగా పనికొచ్చాయి..’’ అని క్యాప్షన్‌ పెట్టారు.

‘ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను ఇలా కూడా వాడొచ్చని మాకు తెలియదు’, ‘ఈ ఐడియా ఏదో చాలా బాగుంది..’ అని కొందరు అంటుంటే.. ‘నవరాత్రి ఉత్సవాలకు ఏది అడ్డు వచ్చినా ఆగేదే లేదు. వేడుకలపై వెనక్కి తగ్గేదే లేదు..’ అని అని మరికొందరు పేర్కొంటున్నారు. ‘‘సమస్య ఏదైనా, ఎలాంటిదైనా సరే.. దానికి కచ్చితంగా ఓ పరిష్కారం ఉంటుంది. ఇక్కడ వీళ్లు దాన్ని సరిగ్గా గుర్తించి పాటించారు.’’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘‘ఓలా అంటే ప్రయాణం మాత్రమే కాదు. ఎంటర్‌టైన్మెంట్‌. అవసరమైనప్పుడు ఆదుకునే లైఫ్‌ సేవర్‌ కూడా..’’ అని మరో నెటిజన్‌ పేర్కొన్నారు.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Taja Varthalu Sat, 08 Oct 2022 13:45:03 +0530
Telugu Content https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98794-tirumala-crowds-of-devotees-have-risen-to-tirumala.html https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98794-tirumala-crowds-of-devotees-have-risen-to-tirumala.html

తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరకున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా.

దసరా సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇక అత్యంత పవిత్రమైన పెరటాశి మాసంలోని మూడవ శనివారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తమిళ భక్తులకు అనవాయితీగా వస్తోంది. దీంతో గురు, శుక్రవారాల్లోనే తమిళనాడుకు చెందిన భక్తజన సందోహం అత్యంత భారీ సంఖ్యలో తిరుమల కోండకు చేరుకుని శనివారం రోజున స్వామివారి దర్శనానికి వేచిచూసింది. కాగా కరోనా కారణంగా గడిచిన రెండేళ్లు తిరుమలకు పెద్ద సంఖ్యలో రానీ భక్తులు ఈ సారి మాత్రం మలయప్ప స్వామి దర్శనానికి పోటేత్తారు.

ఈ నేపథ్యంలో దాదాపుగా భక్తుల క్యూలైను గోగర్భం డ్యామ్ వరకు చేరుకోవడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం వరకు క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. ఈ సాయంత్రం క్యూలైన్ల వద్దకు వచ్చిన భక్తులను అధికారులు తిప్పి పంపారు. వారు రేపు ఉదయం 6 గంటలకు రావాలని సూచించారు. దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించిన ఆయన, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని, అందుకే రద్దీ పెరిగిందని అన్నారు. రద్దీ వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Taja Varthalu Sat, 08 Oct 2022 12:48:41 +0530
Telugu Content https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98793-government-makes-it-easier-to-get-bh-series-number-plates.html https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98793-government-makes-it-easier-to-get-bh-series-number-plates.html

దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్ పేరుతో, ఆంధప్రదేశ్ అయితే ఏపీ పేరుతో, తమిళనాడులో టీఎన్ పేరుతో వాహన నంబర్ ప్లేట్లపై సిరీస్ మొదలవుతుంది. వీటి మాదిరే బీహెచ్ విధానం కూడా పనిచేస్తుంది. వివిధ రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలు బీహెచ్ సిరీస్ కు మారిపోయే అవకాశం కూడా రానుంది. నిబంధనలకు సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివిధ రాష్ట్రాల పరిధిలో ఉద్యోగరీత్యా బదిలీ అయిన సందర్భాల్లో వాహనాల రిజిస్ట్రేషన్ ను కూడా మార్చుకోవడం ప్రస్తుతానికి తప్పనిసరి. వీరిని దృష్టిలో పెట్టుకునే కేంద్ర సర్కారు బీహెచ్ ను తీసుకొచ్చింది. బీహెచ్ కింద రిజిస్టర్ అయిన వాహనాలు దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి అక్కడ తిరుగుతున్నా, రిజిస్ట్రషన్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలు నిర్ధేశిత పన్ను చెల్లించడం ద్వారా బీహెచ్ కు మారిపోవచ్చు. ఇకపై బీహెచ్ పరిధిలో వాహన రిజిస్ట్రేషన్ బదిలీలు (విక్రయించినప్పుడు) సులభంగా కానున్నాయి.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Taja Varthalu Sat, 08 Oct 2022 11:46:10 +0530
Telugu Content https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98792-garikipati-issue-fans-should-not-spoil-chiru%E2%80%99s-magnanimity.html https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98792-garikipati-issue-fans-should-not-spoil-chiru%E2%80%99s-magnanimity.html

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు కావడంతో మెగా అభిమానులు అగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే అవధాని, పండితుడు అయిన గరికపాటి నరసింహారావుపై మెగా అభిమానులు ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరాదని తాజాగా నాగబాబు వివరణ ఇచ్చారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో చోటుచేసుకున్న సంఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.

తాజాగా ఇవాళ వివరణ ఇస్తూ నాగబాబు మరో ట్వీట్ చేశారు. గరికపాటి లాంటి పండిత ఉద్దండుడు తమకు క్షమాపణలు చెప్పాలని తాము కోరుకోవడం లేదని.. అయితే పరిస్థితులను అర్థం చేసుకోవాలని మాత్రమే అన్నామని వివరణ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన రాస్తూ..  'గరికపాటి వారు ఏదో మూడ్‌లో ఆలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని.. ఆయనను ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రెక్వెస్ట్.' అంటూ పోస్ట్ చేశారు.

జరిగిందిదే: దసరా సందర్భంగా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ వేడుకలో జరిగిన ఆసక్తికర సన్నివేశం మెగా ఫ్యాన్స్ కు గరికపాటికి మధ్య పోరపచ్చాలను పోడచూపింది. సరిగ్గా పండితులు గరికపాటి నరసింహారావు సమ్మెళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న తరుణంలో అప్పటికే వేదికను అలంకరించిన మెగాస్టార్ చిరంజీవిని చూసిన అభిమానులు ఆయనతో ఫోటో సెషన్‌ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. లేదంటే తాను వెళ్లిపోతానని నిరసన తెలపడంతో.. చిరంజీవి వెంటనే వచ్చి గరికపాటికి నమస్కరించి పక్కన కూర్చున్నారు.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Taja Varthalu Fri, 07 Oct 2022 19:34:41 +0530
Telugu Content https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98791-gujarat-police-chief-orders-probe-over-cops-thrashing-garba-attack-suspects-in-kheda-district.html https://mail.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98791-gujarat-police-chief-orders-probe-over-cops-thrashing-garba-attack-suspects-in-kheda-district.html

గుజ‌రాత్‌ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రచారాలు ఖండాంతరాలు దాటుతున్న క్రమంలో రాష్ట్రంలోని జిల్లాల్లో జరుగుతున్న పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గుజరాత్ లోని ఖేడా జిల్లాలో ఉన్న ఉన్‌దేలా గ్రామంలో కొంత మంది ముస్లిం యువ‌కుల్ని పోల్‌కు క‌ట్టేసి పోలీసులు  లాఠీల‌తో చిత‌క్కొట్టిన విష‌యం తెలిసిందే.

ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియోలు కొన్ని రోజులుగా వైర‌ల్ అవుతున్నాయి. ఆ గ్రామంలో జ‌రిగిన గ‌ర్భా వేడుక‌ల్లో యువ‌కులు అల్ల‌రి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్థానిక ప్రజల సమక్షంలోనే వారిని విద్యుత్ స్థంబాలకు కట్టేసి.. వారిపై లాఠీలను జుళిపించారు. ఇద్దరు పోలీసులు వారి చేతులను పట్టుకుని విద్యుత్ స్థంబాలకు ఓ వైపు నుంచి లాగుతుండగా, మరో వైపు యువకులు స్థంబానికి అత్తుక్కపోగా, వారి వెనుక నుంచి మరికోందరు పోలీసులు లాఠీ దెబ్బలను కోట్టారు. ఈ తతంగాన్ని చూస్తున్న అక్కడి జ‌నం చ‌ప్ప‌ట్లు కొడుతుండాగా ఆ యువ‌కుల్ని చిత‌క‌బాదారు.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర డీజీపీ ఆశిష్ భాటియా విచార‌ణ‌కు ఆదేశించారు. యువ‌కుల్ని లాఠీల‌తో కొట్టింది పోలీసులే అని ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఈ ఘటనపై విచార‌ణ‌కు ఆదేశించామ‌ని, వాళ్ల‌పై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన‌ట్లు ఆశిష్ భాటియా తెలిపారు. మ‌రికొన్ని రోజుల్లో ఈ ఘ‌ట‌న‌పై రిపోర్ట్‌ను పోలీసుల‌కు అంద‌జేయ‌నున్నారు. గుజ‌రాత్‌లోని ఓ ఎన్జీవో సంస్థ ఈ ఘ‌ట‌న ప‌ట్ల రియాక్ట్ అయ్యింది. రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీతో పాటు డీజీపీకి లీగ‌ల్ నోటీసులు జారీ చేసింది. బ‌హిరంగంగా యువ‌కుల్ని చిత‌క కొట్టిన ఘ‌ట‌న‌లో మైనార్టీ కోఆర్డినేష‌న్ క‌మిటీ క‌న్వీన‌ర్ ముజాహిద్ న‌ఫీస్ కొంద‌రు ఆఫీస‌ర్ల‌కు కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసుల‌ను పంపించారు.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Taja Varthalu Fri, 07 Oct 2022 18:33:20 +0530