Jai ho expects 300 crore collection

Jai Ho movie 300 crore, Salman Khan Jai Ho Movie, Chirnajeevi Stalin movie, Actress Tabu, Sana Khan, Actor Sunil Shetty

jai ho expects 300 crore collection

హిందీ స్టాలిన్ 300 కోట్లు కొడతాడట

Posted: 01/24/2014 12:01 PM IST
Jai ho expects 300 crore collection

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ కి హిందీ రూపాంతరం జయ్ హో ఈ రోజు థియేటర్లలో విడుదలైపోయింది.  సల్మాన్ ఖాన్ నటించిన జయ్ హో ను అతని సోదరుడు సోహిల్ ఖాన్ తన సోహిల్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకం మీద నిర్మించాడు. 

అవినీతిని అంతమొందిస్తామని ఢంకా బజాయిస్తున్న భాజపా, ఈ మధ్య కాలంలో ఆఆపా లకు వచ్చిన ఆదరణ ఎంతుందో దేశమంతా చూసింది.  చట్ట సభల ద్వారా చట్టాన్ని అమలుపరచే పోలీసు శాఖ ద్వారా కాకుండా ఒక సినిమా హీరో ఫక్కీలో ఈ చిత్రంలో తనదంటూ ఒక సేనను తయారు చేసుకుని అవినీతిని అంతమొందించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ భరోసాతో ఉంది. 

సినీ విశ్లేషకులు ఏకంగా  ఈ సినిమా 300 కోట్లను వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.  అయితే ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నా 200 కోట్ల వసూలు చేస్తే ఎక్కువై అంటున్నారు మరి కొందరు.  దబంగ్, దబంగ్-2, ఏక థా టైగర్, బాడీ గార్డ్ సినిమాలు సల్మాన్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.  అందువలన సల్మాన్ ఖాన్ కి పెరిగిన అభిమానుల సంఖ్య వలన ఓపెనింగ్స్ తో పాటు 200 కోట్లయితే ఖాయమని మరికొందరు అంటున్నారు.

దేవీ శ్రీ ప్రసాద్, సాజిద్ వాజిద్, అను మల్లిక్ లు ఈ సినిమాలో పాటలకి సంగీతం, సందీప్ శిరోడ్కర్ నేపథ్య సంగీతాన్నందించారు.

స్టాలిన్ లో చిరంజీవి పాత్ర సల్మాన్ ఖాన్ వేస్తున్నారని తెలుస్తూనేవుంది.  ఇక సహాయక పాత్రలను చూస్తే, చిరంజీవికి అక్కగా వేసిన ఖుష్బూ పాత్రలో టబు, త్రిష పాత్రలో సనా ఖాన్, ప్రకాశ్ రాజ్ పాత్రలో సునిల్ శెట్టి నటిస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more