Superstar Rajinikanth delivers out his best for Petta ‘పేట’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘పేట’ ‘పేట’ Get information about Petta Telugu Movie Review, Rajinikanth Petta Movie Review, Petta Movie Review and Rating, Petta Review, Petta Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 89484 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘పేట’

  • బ్యానర్  :

    స‌న్ పిక్చ‌ర్స్‌

  • దర్శకుడు  :

    కార్తీక్ సుబ్బ‌రాజు

  • నిర్మాత  :

    క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని

  • సంగీతం  :

    అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    తిరు

  • ఎడిటర్  :

    వివేక్ హ‌ర్ష‌న్

  • నటినటులు  :

    ర‌జ‌నీకాంత్‌, సిమ్ర‌న్‌, త్రిష‌, విజ‌య్‌ సేతుప‌తి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, మేఘా ఆకాష్, యోగిబాబు తదితరులు

Petta Moive Review

విడుదల తేది :

2019-01-10

Cinema Story

కాళీ(ర‌జ‌నీకాంత్‌) ఒక కాలేజ్‌లో హాస్ట‌ల్ వార్డెన్‌గా చేర‌తాడు. అక్క‌డ చోటు చేసుకునే ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన స్టైల్‌లో ప‌రిష్క‌రిస్తాడు. ఒక ప్రేమ జంట‌ను కూడా క‌లుపుతాడు. అనుకోని ప‌రిస్థితుల్లో లోక‌ల్ గూండాతో గొడ‌వ పెట్టుకుంటాడు. అప్పుడే అత‌ని పేరు కాళీ కాదు... పేట అని, అత‌డిది ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ అని తెలుస్తుంది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సింహాచ‌లం(న‌వాజుద్దీన్‌) అనే రాజ‌కీయ పెద్ద నాయ‌కుడితో విభేదాలు ఉంటాయి. అవి ఏంటి? అస‌లు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ నుంచి పేట ఎందుకు వ‌చ్చాడు? మ‌ళ్లీ అక్క‌డ‌కు వెళ్లాడా?  వెళ్లి ఏం చేశాడ‌న్న‌ది క‌థ‌. అతను ఎదర్కోన్న పరిస్థితులు ఏమిటీ.? సమస్యలు ఏమిటీ రాజకీయా పెద్దతో ఎందుకు విబేధాలు వున్నాయన్నది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

cinima-reviews
‘పేట’

విశ్లేషణ

ర‌జ‌నీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వుండటానికి ఆయన స్టైల్‌, ఎన‌ర్జీ, మేనరిజం ఒక కారణమం. అదే స్టైల్, మేనరిజం, ఎనర్జీతో రజనీ నటించిన తాజాచిత్రం పేట. ‘క‌బాలి’, ‘కాలా’, ‘2.ఓ’ చిత్రాలు ర‌జ‌నీలో ఉన్న మేన‌రిజాన్ని, స్టైల్ తెరపై చూపించలేదు. అందుకు ఆయా క‌థ‌లు, హీరో బ్యాక్ డ్రాప్ కూడా కారణాలు. అయితే, చాలా కాలం త‌ర్వాత ర‌జ‌నీ త‌న స్టైల్, మేనరిజాలను చూపించుకోవ‌డానికి, త‌న ఛ‌రిష్మా చూపించిన తాజా చిత్రం పేట.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రజనీ స్టైల్, మేనరిజంతో పాటు ఆయన ఎనర్జీని కూడా ఫుల్ లెంగ్త్ లో వాడుకోవ‌డానికి ఇలాంటి క‌థ‌ను ఎంచుకున్నాడా.? అని అనిపిస్తోంది. న‌వ‌త‌రం ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల్లో కార్తీక్ సుబ్బ‌రాజు ఒక‌డు. త‌న క‌థ‌ల్లో చిన్న గ‌మ్మ‌త్తు ఉంటుంది. కాక‌పోతే అత‌ను కూడా ర‌జ‌నీ స్టైల్ ను ఫాలో అయిపోతూ, ర‌జ‌నీ సినిమాకు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. తొలి స‌న్నివేశాలు, ర‌జ‌నీ ప‌రిచ‌య దృశ్యాలు, హాస్ట‌ల్ లో జ‌రిగే సంఘ‌ట‌న‌లతో రజనీని వాడేసుకుని అభిమానుల‌ను మెప్పించాడు కార్తీక్ సుబ్బరాజు.

ఈ చిత్రంలోని ఫైటింగ్ సన్నివేశాలు కూడా అలాగే స్టైల్ గా చిత్రీకరించాడు కార్తీక్. సిమ్ర‌న్‌ తో జ‌రిగే ట్రాక్ మొత్తం వింటేజ్ ర‌జ‌నీకాంత్ ను మ‌న‌కు చూపిస్తుంది. విరామ స‌న్నివేశాల వ‌ర‌కూ ఇసుమంత క‌థ కూడా ద‌ర్శ‌కుడు చెప్ప‌లేదు. కేవ‌లం ర‌జ‌నీ అభిమానుల‌ను మెప్పించ‌డానికే స‌న్నివేశాల‌ను అల్లుకుంటూ వెళ్లాడు. ఇదే ఆయన అభిమానులను ధియేటర్లకు రప్పిస్తుందన్న బలమైన నమ్మకంతోనే కార్తీక్ సుబ్బరాజు ఈ ప్రయత్నం చేశాడు.

ద్వితీయార్ధంలో రజనీ ప్లాష్ బ్యాక్ కథ.. రజనీ కాంత్ పేట నుంచి కాళీగా మారడానికి కారణమైన కథ.అయితే దానిని కూడా క‌మ‌ర్షియ‌ల్ స‌న్నివేశాల‌తో న‌డిపించాడు. మొత్తంగా చూస్తే ఇదో రివేంజ్ డ్రామా. తొలి స‌గంలో ర‌జ‌నీ మేన‌రిజ‌మ్స్‌, స్టైల్‌పై ఆధార‌ప‌డిన ద‌ర్శ‌కుడు, సెకండాఫ్ మొత్తాన్ని ఫ్లాష్‌బ్యాక్‌, త‌ను తీర్చుకునే ప‌గ‌తోనూ పూర్తి చేశాడు. బ‌ల‌మైన ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఇలాంటి క‌థ‌లు అదిరిపోతాయి. కానీ, అదే ఈ సినిమాకు కాస్త లోపంగా మారింది.

కార్తీక్ సుబ్బ‌రాజు ఈ క‌థ‌ను ఎందుకు ర‌జ‌నీ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడు? ర‌జ‌నీ ఎందుకు ఒకే చెప్పారో అర్థం కాదు కానీ, ఇది అంద‌రికీ తెలిసిన క‌థే. ఫ్లాష్‌బ్యాక్ ర‌క్తిక‌ట్టి ఉంటే, ఈ సినిమా మ‌రో రేంజ్‌లో ఉండేది. ఇటీవ‌ల కాలంలో ర‌జ‌నీని ర‌జ‌నీలా చూడ‌లేక‌పోయామ‌ని నిరాశ ప‌డుతున్న అభిమానుల‌కు మాత్రం ఇది ఫుల్‌మీల్స్‌. పాట‌లు క‌థ గ‌మ‌నానికి స్పీడ్ బ్రేక‌ర్స్‌లా ఉన్నాయేమో అనిపిస్తుంది. అందులో కూడా ర‌జ‌నీ స్టైల్‌ను చూసి మురిసిపోవ‌డం త‌ప్ప ఆ పాట‌ల వ‌ల్ల సినిమాకు వ‌చ్చిన అద‌న‌పు బ‌లం ఏమీ ఉండ‌దు.

నటీనటుల విషానికి వస్తే

ఫుల్ ఎన‌ర్జీతో ఈ సినిమాలో రజనీకాంత్ న‌టించారు. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. ఆయ‌న్ను అభిమానులు ఎలా చూడాల‌ని అనుకుంటున్నార‌ో  బాగా తెలిసిన‌.. అభిమానిగా, ద‌ర్శ‌కుడిగా కార్తీక్ సుబ్బ‌రాజ్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. కబాలి, కాలా సినిమాల్లో క‌న‌ప‌డ‌ని ఓ ఎన‌ర్జీ ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌లో చూస్తారు. అలాగే ఆయ‌న గ‌త చిత్రాల‌తో పోల్చితే వ‌య‌సును మించి క‌ష్ట‌ప‌డి డ్యాన్సులు కూడా వేశారు. త‌న‌లోని న‌టుడిని స‌వాల్ చేసే స‌న్నివేశం ఈ చిత్రంలో ఒక్క‌టి కూడా క‌నిపించ‌దు.

చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కుర్రాడిలా ర‌జ‌నీకాంత్ ఇచ్చే హావ‌భావాలు కాస్త ఎంట‌ర్‌టైన్ చేస్తాయి. ఈ వ‌య‌సులోనూ అంత జోరుగా న‌టించ‌డం కేవ‌లం ర‌జ‌నీ వ‌ల్ల మాత్ర‌మే అవుతుంది. ఇక కామెడీ టైమింగ్‌లో ర‌జనీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జ‌నీకాంత్‌, సిమ్రాన్ ట్రాక్ మెప్పిస్తుంది. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయసేతుపతి లాంటి నటులు కూడా తమ పాత్రలలో స్తాయికి తగ్గట్టుగా నటించి మెప్పించారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపిస్తోంది. త‌న‌దైన నేప‌థ్య సంగీతంతో అనిరుధ్ హోరెత్తించాడు. ర‌జ‌నీని అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూడ‌టానికి అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్స్ చ‌క్క‌గా స‌రిపోయాయి. తిరు సినిమాట్రోగ‌ఫ్రీ చాలా బాగుంది. సాంకేతికంగా ర‌జ‌నీ సినిమాల స్థాయిలోనే పేట కూడా ఉంది. కొన్ని సంభాష‌ణ‌లు గ‌మ్మ‌త్తుగా అనిపిస్తాయి.

 

తీర్పు..

రజనీకాంత్ అభిమానిగా, అభిమానులు ఆయనను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా సినిమాను తీర్చిదిద్దినా.. ద్వితీయార్థంలో మాత్రం స్లో నరేషన్ కారణంగా సినిమా కొంత లాగ్ చేసినట్లు అనిపిస్తుంది. పొంగల్ వేళ.. రజీనీ అభిమానులకు అదనపు పండగ

చివరగా... పేట.. రజనీకాంత్ అభిమానులకు పండగ విందు..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh