Mahesh Babu Brahmotsavam Movie Review

Teluguwishesh బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం Get The Complete Details of Brahmotsavam Movie Review. Starring Mahesh Babu, Samantha, Kajal Aggarwal and Pranitha Subhash. Directed by Srikanth Addala and music by Mickey J Meyer. Produced by Prasad V Potluri under the PVP Cinema banner and G. Mahesh Babu Entertainment Pvt. Ltd. For More Details Visit Cinewishesh.com Product #: 74757 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బ్రహ్మోత్సవం

  • బ్యానర్  :

    పివిపి, జి.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్

  • దర్శకుడు  :

    శ్రీకాంత్ అడ్డాల

  • నిర్మాత  :

    పరల్.వి.పోట్లూరి

  • సంగీతం  :

    మిక్కీ.జే.మేయర్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    రత్నవేలు

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వరరావు

  • నటినటులు  :

    మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత, సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్, షాయాజీ శిండే, రావు, రమేష్ తదితరులు

Brahmotsavam Movie Review

విడుదల తేది :

2016-05-20

Cinema Story

తనచుట్టూ ఎప్పుడూ నలుగురు వుండాలనుకునే మనస్తత్వం గల వ్యక్తి సత్యరాజ్. సత్యరాజ్-రేవతిల కొడుకు మహేష్. తనకు ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లిపోయే మనస్తత్వం గలవాడు. సామాన్యుడిగా జీవితం స్టార్ట్ చేసిన సత్యరాజ్ ఓ పెయింటింగ్ కంపెనీకి ఓనర్ గా కోట్లకు అధిపతి అవుతాడు. ఈ కంపెనీని మహేష్ చూసుకుంటాడు. సత్యరాజ్ తన నలుగురు బావమరుదులను ఇంట్లోనే వుంచుకొని.. అందమైన ఉమ్మడి కుటుంబంతో జీవిస్తుంటాడు. తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ కూడా అలాంటి వ్యక్తే. అనుకోకుండా సత్యరాజ్ పెద్ద బావమరిది రావు రమేష్... సత్యరాజ్ కు ఇచ్చిన ఓ షాక్ తో సత్యరాజ్ చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సత్యరాజ్ కు రావు రమేష్ ఇచ్చిన షాక్ ఏంటి? ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీతల పాత్రలేంటి? సత్యరాజ్ ఏర్పాటుచేసుకున్న ఉమ్మడి కుటుంబం అలాగే వుందా లేక విడిపోయిందా? తన తండ్రి అనుకున్న ఏడు తరాల వారిని కలిపేందుకు మహేష్ ఏం చేసాడు? అన్నదే బ్రహ్మోత్సవం కథ.

cinima-reviews
బ్రహ్మోత్సవం

‘శ్రీమంతుడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించాడు. కాజల్, సమంత హీరోయిన్లుగా నటించారు. ప్రణీత, సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్, షాయాజీ శిండే, రావు, రమేష్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. భారీ బడ్జెట్ తో పివిపి బ్యానర్, జి.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లపై నిర్మాత పరల్.వి.పోట్లూరి నిర్మించారు. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
‘బ్రహ్మోత్సవం’ సినిమాను స్టార్ హీరోహీరోయిన్లు, అగ్ర నటీనటులు అని చూడకుండా... కేవలం ఇందులోని పాత్రలు మాత్రమే కనిపించడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఏ సినిమా అయినా కూడా హీరోహీరోయిన్లే ప్లస్ పాయింట్స్ గా నిలుస్తారు.. కానీ ఈ సినిమాలో ఒక్కొక్క పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. కానీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే మాత్రం మహేష్ బాబు అనే చెప్పుకోవాలి. సినిమా అంతా కూడా తన భుజాలపై నడిపించాడని చెప్పుకోవాలి.

ఇందులో మహేష్ నటన అద్భుతం. ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో మహేష్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. తన పాత్రలో లీనమయ్యి సినిమాను నడిపించేసాడు. ముఖ్యంగా లవ్, ఎమోషనల్ సీన్లలో మహేష్ యాక్టింగ్ సూపర్బ్. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా మహేష్ మెప్పించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మహేష్ లేకుండా ‘బ్రహ్మోత్సవం’ సినిమాను మరే ఇతర హీరోతో ఊహించుకోలేము అనిపించే విధంగా చేసాడు.

ఇక సమంత తన పాత్ర మేరకు బాగా నటించింది. గలగల మాట్లాడుతూ వుండే పాత్రలో సమంత మరోసారి తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. సమంత-మహేష్ ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ‘బాలత్రిపురమణి’ పాత్రలో కనిపించిన కాజల్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. కొన్ని కొన్ని సీన్లలో కాజల్ చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లలో కుర్రకారు విజిల్స్ వేస్తున్నారు. చాలా మోడ్రన్ అమ్మాయిగా కాజల్ చేసింది. కాజల్-మహేష్ కాంబినేషన్లో వచ్చే సీన్లు బాగున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఇక ప్రణీత తన పాత్రకు తగిన న్యాయం చేసింది. లంగావోణీలో చాలా ట్రెడిషనల్ అమ్మాయిగా కనిపించింది. లుక్స్ పరంగా బాగుంది.

ఇక ఈ సినిమాకు నటులు సత్యరాజ్ మరో మేజర్ ప్లస్ పాయింట్. సత్యరాజ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేసాడు. చాలా సెటిల్డ్ గా, మహేష్ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే సత్యరాజ్ చెప్పే చిన్న చిన్న డైలాగులు, హవాభావాలు సినిమాలో మంచి ఫీల్ ను క్యారీ చేస్తాయి. సత్యరాజ్-మహేష్ కాంబినేషన్లో వచ్చే సీన్లు తండ్రికొడుకుల మధ్య వుండే అనుబంధాన్ని మరింత పెంచే విధంగా వున్నాయి. ఇక రేవతి, జయసుధ, నరేష్, షాయాజీ శిండే, రావు, రమేష్, ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, తులసి తదితరులు వారి వారి పాత్రలలో జీవించేసారు. ముఖ్యంగా ‘నాయుడోరింటికాడ...’, ‘వచ్చింది కదా అవకాశం...’ పాటలలో వీరి సందడి మాములుగా లేదు. కేవలం సన్నివేశాలలోనే కాకుండా పాటలలో కూడా దుమ్ముధులిపేసారు.

‘బ్రహ్మోత్సవం’ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదా సరదాగా సాగిపోతుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్ తో కొనసాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా సింపుల్ గా ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో లవ్, ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ సీన్లతో ఆకట్టుకున్నాయి. భారీ యాక్షన్ సీన్లు, ఫైట్లు, రక్తపాతాలు, అడల్ట్ కామెడీలు, ఐటెం సాంగులు వంటివి ఏమి లేకుండా కుటుంబ సమేతంగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రంగా ‘బ్రహ్మోత్సవం’ వుందని చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ నెరేషన్. సినిమా ప్రారంభమైన క్షణం నుంచి చాలా స్లోగా సాగుతుంది. చూసే ప్రేక్షకులకు బోర్ కలిగిస్తుంది. సినిమా అంతా కూడా సాగదీస్తున్నట్లుగా అనిపిస్తుంది. సినిమాలో వేగం తగ్గడం వల్ల ప్రేక్షకుల బాబోయ్ అనిపించే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇందులో మాస్ ఆడియన్స్ నచ్చే విధంగా భారీ యాక్షన్ సీన్లు, మాస్ మసాలా పాటలు, సీన్లు లేకపోవడం మైనస్ గా చెప్పుకోవచ్చు. అలాగే సినిమా రన్ టైం మరో మైనస్. 2గంటల 36నిమిషాల నిడివి చాలా ఎక్కువయ్యింది. అసలే సినిమాలో వేగం లేకపోవడంతో.. మరీ ఇంత సమయం ప్రేక్షకులను కూర్చోబెట్టడం కష్టమయ్యింది. చూసే జనాలకు చిరాకును కలిగిస్తుంది. ఇందులో 15నిమిషాలు ఎడిటింగ్ చేసిన బాగుండేది. ఇక ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్లు బాగా ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కాస్త ఎడిటింగ్ చేసి వుంటే బాగుండేది.

సాంకేతికవర్గం పనితీరు:
‘బ్రహ్మోత్సవం’ సినిమాకు టెక్నికల్ బృందమంతా కూడా ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి మూల కారణమైన నిర్మాత పివిపికి హ్యాట్సాఫ్ అని చెప్పుకోవాలి. సినిమాను విజువల్ వండర్ గా, చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా... సినిమా అంతా కూడా విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ లుక్ తో ఆకట్టుకుంది. ఇక సాంకేతికనిపుణులలో ముందుగా సినిమాటోగ్రాఫర్ నుంచి మాట్లాడుకుందాం.

రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫి సింప్లీ సూపర్బ్. ప్రతి ఫ్రేం కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఇందులో మహేష్ చాలా అందంగా, స్లిమ్ గా కనిపించాడు. మహేష్ ను ఓ ఇరవై అయిదేళ్ల కుర్రోడిగా చూపించారు. స్క్రీన్ మీద చూస్తుంటే ప్రతి విజువల్ కూడా సూపర్బ్. ముఖ్యంగా ‘వచ్చింది కదా అవకాశం..’ సాంగ్ లో అంతమంది ఆర్టిస్టులను ఫ్రేంలో పర్ఫెక్ట్ గా చూపించగలిగారు. పర్ఫెక్ట్ లైటింగ్ తో వండర్ ఫుల్ విజువల్ ట్రీట్ ఫిల్మ్ గా ‘బ్రహ్మోత్సవం’ను రత్నవేలు తన సినిమాటోగ్రఫితో తీర్చిదిద్దారు. రత్నవేలు సినిమాటోగ్రఫికి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సెట్టింగ్స్ ప్రాణం పోసాయి. అద్భుతమైన సెట్టింగ్స్.. కలర్స్,. ఇలా అన్నింటిలో కూడా తోటతరణి ఆర్ట్ వర్క్ సూపర్బ్ అని అనిపిస్తోంది.

‘బ్రహ్మోత్సవం’ సినిమా కాన్సెప్టుకు మిక్కీ.జే.మేయర్ తన మ్యూజిక్ తో మరింత అందాన్ని తెచ్చాడు. పాటలు వెండితెరమీద విజువల్స్ తో చూస్తుంటే మరింత బాగున్నాయి. మిక్కీ అందించిన రీరికార్డింగ్ సూపర్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో మిక్కీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక ‘బ్రహ్మోత్సవం’ సినిమా కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల. చాలా పాతకాలం నాటి కథకు కాస్త మెరుగులు దిద్ది ‘బ్రహ్మోత్సవం’ కథను సిద్ధం చేసినట్లుగా అనిపిస్తుంది. ఉమ్మడికుటుంబంలో వుండే అనురాగాలు, ఆప్యాయతాలను మరోసారి జనాలకు గుర్తుచేయాలని భావించిన శ్రీకాంత్ అడ్డాల ఆలోచన బాగున్నప్పటికీ.. దానిని సరైన విధంగా చూపించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి. సినిమా అంతా కూడా ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా సింపుల్ గా నడిపించేసాడు. ముఖ్యంగా స్ర్కీన్ ప్లే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి. భారీ తారాగణంను కేవలం సినిమాను గ్రాండ్ గా చూపించడం కోసం కాకుండా.. ప్రతి పాత్రను కూడా కథలో భాగంగా తీసుకొని, వారితో మంచి నటనను రాబట్టుకున్నారు. కానీ అంతమందితో తీసిన సీన్లు సరైన విధంగా వర్కౌట్ అవ్వలేదు. మొత్తానికి ‘బ్రహ్మోత్సవం’ సినిమాను జనాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో శ్రీకాంత్ అడ్డాల ఫెయిల్ అయ్యాడు.

చివరగా:
‘బ్రహ్మోత్సవం’: ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

- Sandy