Columbus Movie Review | Sumanth Ashwin Columbus Review | Columbus Movie Review And Rating

Teluguwishesh కొలంబస్ కొలంబస్ Get information about Columbus Movie Review, Columbus Telugu Movie Review, Sumanth Ashwin Columbus Movie Review, Columbus Movie Review And Rating, Columbus Telugu Movie Talk, Puli Telugu Telugu Movie Trailer, Sumanth Ashwin Columbus Review, Columbus Telugu Movie Gallery and more only on TeluguWishesh.com Product #: 69442 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కొలంబస్

  • బ్యానర్  :

    ఎ.కె.ఎస్.ఎంటర్ టైన్మెంట్స్

  • దర్శకుడు  :

    ఆర్. సామల

  • నిర్మాత  :

    అశ్వని కుమార్

  • సంగీతం  :

    జితిన్ రోషన్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    భాస్కర్ సామల

  • ఎడిటర్  :

    కె.వి.కృష్ణారెడ్డి

  • నటినటులు  :

    సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి తదితరులు

Columbus Movie Review

విడుదల తేది :

2015-10-22

Cinema Story

కెరీర్ పై ఎలాంటి ఆసక్తి లేకుండా లైఫ్ ని ఎంజాక్ చేస్తుంటాడు అశ్విన్ (సుమంత్ అశ్విన్). కాలేజీ రోజుల్లో ఇందు(మిస్తీ చక్రవర్తి)ని గాఢంగా ప్రేమించిన అశ్విన్, ఆమే తన జీవితం అని బతికేస్తుంటాడు. అయితే.. కెరీర్ పై దృష్టి పెట్టని అశ్విన్ ని ఆమె కావాలనే అతనిని దూరం చేస్తుంది. ఈ క్రమంలోనే పై చదువులకు ఇందు ఢిల్లీ వెళ్ళిగా.. ఆమెను కలవడానికి అశ్విన్ కూడా ఢిల్లీ వెళతాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఓ మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కొని జైలు పాలవుతాడు.

జైలు నుంచి తిరిగొచ్చాక మళ్ళీ ఇందును వెతకడం, ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం కోసం ఒక ప్రయాణం మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో అతనికి పరిచయమైన నీరజ (శీరత్ కపూర్) అన్ని విధాలా సహాయం చేస్తుంది.. ఈ ప్రయాణంలో అనుకోకుండానే అశ్విన్, నీరజ దగ్గరవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ ప్రయాణం ఎటువైపు సాగింది? అతడి నిజమైన ప్రేమను ఎలా కనుక్కున్నాడు? ఇందు, నీరజ ఇద్దరిలో చివరకు అశ్విన్ ఎవరికి దగ్గరవుతాడు? అనే ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే.. వెండితెరపై సినిమా చూడాల్సిందే.

cinima-reviews
కొలంబస్

సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా ఎ.కె.ఎస్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అశ్వని కుమార్ నిర్మించిన తాజా చిత్రం ‘కొలంబస్’. ‘డిస్కవరింగ్ ల‌వ్’ అనేది ఉపశీర్షిక. ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు.

జితిన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల అయిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దామా..


Video Courtesy : Volga Video

 

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.. సుమంత్ అశ్విన్, శీరత్ కపూర్‌ల లవ్ ట్రాక్. వారి మధ్య వున్న సన్నివేశాలన్నీ కొంత ఫన్నీగా, ఆసక్తికరంగా ఉండడంతో బాగా ఆకట్టుకుంటాయి. ఇక స్క్రీన్‌ప్లే పరంగా రెండు సమాంతర కథలను నడుపుతూ చివర్లో ఈ రెండింటీనీ రివర్స్ చేయడం సినిమాకు మంచి పాజిటివ్ పాయింట్.

ఇక నటీనటుల విషయానికొస్తే.. అశ్విన్‌గా సుమంత్ అశ్విన్ బాగా నటించాడు. డైలాగ్ డెలివరీలో, కామెడీ టైమింగ్‌లో సుమంత్ పరిణతి సాధించాడు. ఇక శీరత్ కపూర్ నీరూ పాత్రలో చాలా బాగా నటించింది. మిస్తీ చక్రవర్తి తనకిచ్చిన పాత్రకు వీలైనంత మేర న్యాయం చేసింది. ఇక సప్తగిరి కొన్నిచోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. అశ్విన్ తల్లిగా నటించిన రోహిణి ఉన్నంతలో ఆ పాత్రకు ఓ అర్థాన్ని తెచ్చిపెట్టింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్.. బలమైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం. శీరత్ కపూర్ క్యారెక్టర్‌ను పక్కనపెడితే.. మిస్తీ, సుమంత్‌ల క్యారెక్టర్స్‌కు సరైన క్యారెక్టరైజేషన్ లేదు. చివర్లో సుమంత్ క్యారెక్టర్‌కు ఓ జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగినా అది కృత్రిమంగా కనిపిస్తుంది. ఇక సుమంత్ – మిస్తీల లవ్‌స్టోరీ చాలా సాదాసీదాగా ఉంది.

ఇక ఈ సినిమాలో ట్రయాంగిల్ స్టోరీకి ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, ఒకదశలో సినిమా మొత్తం ఒకే ఒక్క సింగిల్ పాయింట్‌తో నడుస్తూ వచ్చిన సన్నివేశాలే వస్తూన్నాయా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఫస్టాఫ్‌లో చాలా చోట్ల సినిమాకు కథా గమనం అంటూ ఒకటి లేకుండా సినిమా అలా అలా ఎయింలెస్‌గా సాగిపోతుంది. ఇక రొమాంటిక్ కామెడీల్లో ఉండే అసలైన ఫన్ ఈ సినిమాలో చాలా చోట్ల మిస్ అయింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రమేష్ సామల గురించి చెప్పుకుంటే.. ఒక ట్రయాంగిల్ లవ్‌స్టోరీలోని కొత్త పాయింట్‌ను బాగానే డీల్ చేశాడు. ఎమ్మెస్ రాజు అందించిన కథను సినిమాగా చెప్పే ప్రయత్నంలో దర్శకుడిగా చాలావరకు సక్సెస్ అయ్యాడు. అయితే క్యారెక్టరైజేషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని కథను ఆ కోణంలో నడిపించి ఉంటే ఈ సినిమా మరో ఎత్తులో నిలబడేది. ప్రీ క్లైమాక్స్‌లో దర్శకుడి పనితనం బాగా ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాటోగ్రాఫర్ భాస్కర్ సామల పనితనం చాలా బాగుంది. ఒక మోస్తారు బడ్జెట్ సినిమా అయినా ఎక్కడా ఆ ఫీల్ రాకుండా చూడడంలో బాగా పనితనం చూపాడు. ఎడిటర్ కె.వి.కృష్ణారెడ్డి పర్వాలేదు. జితిన్ అందించిన మ్యూజిక్ బాగుంది. పాటలన్నీ సినిమాలో కలిసిపోయేవే కావడం కూడా కలిసివచ్చింది. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు : అంతగా థ్రిల్లింగ్ గా చేయని ఓ ప్రేమికుడి ‘ప్రేమ’ ప్రయాణం.