Telugu political gossip harikrishna vs kalyan ram

harikrishna vs kalyan ram, nandamuri kalyanram, nandamuri harikrishna, nandamuri balakrishna, tdp, chandarababu naidu, junior ntr, tdp senior leader nandamuri hari krishna, nandamuri taraka rama rao,

harikrishna vs kalyan ram

హరికృష్ణ తో కొడుకు ఫైట్ ?

Posted: 05/03/2013 11:07 AM IST
Telugu political gossip harikrishna vs kalyan ram

బాబాయ్ కోసం.. మరో అబ్బాయి తెరపైకి వచ్చాడు. చంద్రమామ కోసం.. మరో అల్లుడు మీడియా ముందుకు రావటం జరిగింది. బాబాయ్ తో విభేదాలు, మామగారితో కయ్యాలు, సైలెంటుగా పెట్టుకుంటున్నా తండ్రి కొడుకులకు తేరుకోని షాకిచ్చాడు.. మరో అబ్బాయి. ‘‘తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే ’’ అనేవిధంగా .. పార్టీ కోసమే నేను అంటూ మీడియా ముందు గర్వంగా చెబుతున్నారు నటుడు కళ్యాణ్ రామ్. తెలుగుదేశం పార్టీలో నందమూరి,

నారా కుటుంబాల మధ్య తగాదా చిత్రవిచిత్రంగా సాగుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కుమారులు హరికృష్ణ, బాలకృష్ణల మధ్య విబేధాలు చోటు చేసుకున్న సంగతి బహిరంగ రహస్యమే. బాలకృష్ణ కుమార్తెను చంద్రబాబు కుమారుడు లోకేష్ వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరి మధ్య సంబందం ఇంకా గట్టిపడింది.అయితే జూనియర్ ఎన్.టి.ఆర్.విషయంలో ఏర్పడిన విబేధాలు హరికృష్ణకు చంద్రబాబుకు మధ్య అంతరం పెంచినట్లు కనబడుతుంది. జూనియర్ ఎన్.టి.ఆర్.ఫ్లెక్సీని, ఎన్.టి.ఆర్.ఫ్లెక్సీని కొందరు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా టిడిపి నుంచి వెళ్లిన నేతలు వాడినప్పుడు అది వివాదంగా మారింది.

ఆ సందర్భంగా పార్టీ నేతలు ఒకరకంగా మాట్లాడితే హరికృష్ణ మరో రకంగా మాట్లాడారు. పైగా చంద్రబాబును ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు.అంతేకాక విశాఖ పాదయాత్ర ముగింపు సభకు గైర్ హాజరయ్యారు. అలాగే జూనియర్ ఎన్.టి.ఆర్. కూడా విశాఖ సభవైపు చూడలేదు. అలాగే అక్కడ వారికి సంబందించి ఫోటోలను కూడా ఎవరు పెట్టలేదు.ఈ నేపధ్యంలో హరికృష్ణ కుమారుడు కళ్యాణరామ్ మాత్రం తాను చంద్రబాబు వెన్నంటి ఉంటానని ప్రకటించడం ఆసక్తికరమైన పరిణామం. తండ్రి హరికృష్ణతో విబేధించినట్లు కనబడకపోయినా, తండ్రి వైఖరితో ఏకీభవించడం లేదన్న భావన కలుగుతుంది.లేదా హరికృష్ణ ఎలా మాట్లాడినా టిడిపి అదినేతతో సత్సంబంధాలు ఉండడమే మంచిదన్న అభిప్రాయంలోకి వచ్చి ఉండాలి.

తాజాగా తిరుమలలో కళ్యాణ రామ్ కాకతాళీయంగా ఈవ్యాఖ్యలు చేశారో ,లేదా కావాలని చేశారో కాని అవి ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పాలి.చంద్రబాబునాయుడుకు, హరికృష్ణ కు మధ్య విబేధాలు లేవని, అవన్ని మీడియా సృష్టేనని కళ్యాణరామ్ వ్యాఖ్యానించారు.ప్రతి చిన్న విషయాన్ని కూడా మీడియా పెద్దగా చూపిస్తోందని ఆయన అన్నారు. తాను అందరి మంచి కోరే వాడినని, చంద్రబాబు వెంట ఉంటానని పార్టీ కోసం తన వంతు కృషి చేస్తానని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.అంటే దానర్దం హరికృష్ణ ఏమి మాట్లాడినా తనకు సంబందం లేదని చెబుతున్నారా?తండ్రి మాటలతో విబేధిస్తున్నారా?

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more