అమ్మ.... అమ్మ అంటూ.. ఎగురుకుంటు వెళ్లిన తెలంగాణ ఎంపీలకు అమ్మ షాక్ ఇచ్చింది. అమ్మ ముందు గుప్పింగంతులు వేయాలని చూసిన మన తెలంగాణ ఎంపీలకు అమ్మ ఉగ్రరూపం చూపించింది. అప్పటి వరకు మన తెలంగాణ ఎంపీలు కేకలతో రచ్చ రచ్చ చేస్తున్న వారు కాస్త ..గాలి తీసిన బెలున్ లా మారిపోయి బల్లమీద చతికలపడ్డారు. తోక జాడిస్తే .. తోకలు కోస్తాను అని అమ్మ పలికిన మాటలు లోక్ సభలో రీసౌండ్ వచ్చిందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. లోక్ సభ లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఆందోళనకు సిద్దం కాగా ..గొడవ చేయదలిస్తే బయటకు వెళ్లి చేయండని అమ్మ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.దాంతో మొదట పదిమంది ఎమ్.పిలు ఆందోళనకు దిగగా, ఆ తర్వాత ఆ సంఖ్య ఆరుకు తగ్గింది. కాని సోనియాగాంధీ కోపం ప్రదర్శించడంతో తెలంగాణ ఎమ్.పిలు మౌనంగా వెళ్లిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎమ్.పిలు కొందరు ఆ తర్వాత మళ్లీ లోనికి వచ్చి మౌనంగా కూర్చున్నారట .దీనితో తెలంగాణపై సోనియా వైఖరి ఏమిటా అన్న చర్చ ఆరంభమైంది. సొంత పార్టీ ఎమ్.పిలే గొడవ చేయడాన్ని ఆమె సహించ లేకపోయారు.దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఎలాంటి వైఖరి అవలంభిస్తారన్నది చర్చనీయాంశం అవుతోంది.ఇంతకాలం సోనియాగాందీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెబుతూ వచ్చిన టి.ఎమ్.పిలకు ఇది మింగుడు పడని విషయమే అవుతుంది.కాగా టిఆర్ ఎస్ ఎమ్.పిలు సభలో దర్నా చేసిన సమాచారం ఏదీ లేదు.లోక్‌సభ మధ్యాహ్నం పన్నెడు గంటలకు తిరిగి సమావేశమయ్యేందుకు కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. లోక్‌సభ నాయకుడుగా ఎన్నికైన హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేను అభినందించేందుకు వెళ్లిన టి. ఎంపీలకు సోనియా గాంధీ క్లాస్ తీసుకున్నారు. టి ఎంపీలు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, జి.వివేక్‌లు మొదట సుశీల్‌కుమార్ షిండే వద్దకు వెళ్లి హోం మంత్రితోపాటు లోక్‌సభ నాయకుడుగా పదోన్నతి పొందినందుకు అభినందనలతో ముంచెత్తారు. మీరు హైదరాబాద్ సంస్థానంలో పుట్టిపెరిగిన వారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న షోలాపూర్ కూడా ఒకప్పటి నిజాం ప్రాంతానికి చెందిందే కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తోడ్పడాలని వారు సుశీల్‌కుమార్ షిండేకు విజప్తి చేశారు.
షిండే చిరునవ్వుతో వారి అభినందనలు స్వీకరిస్తున్న సమయంలో సోనియా గాంధీ సభలోపలికి వచ్చారు.షిండేతో మాట్లాడుతున్న టి. ఎంపీలు అటు తిరిగి సోనియాగాంధీకి నమస్కారం చేశారు. ఆమె తమ సీట్లోకి వెళుతూ సభలో పదకొండు గంటలకు ప్రతిపక్షంతో కలిసి గొడవ చేసినందుకు క్లాస్ తీసుకున్నారు. ప్రతిపక్షం గొడవ చేస్తూ సభను స్తంభింపజేయటం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్న సమయంలోనే మీరు కూడా గొడవ చేయాలా? ఏమిటిది? మీరు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడవేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదంటూ టి ఎంపీలను విమర్శించారు. మీరిలా సభలో గొడవ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనుకుంటున్నారా? అని సోనియా గాంధీ టి.ఎంపీలను ప్రశ్నించారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉండవలసిన సమయంలో సభలో గొడవ చేయటం ఏమిటని ఆమె వారిని నిలదీశారు. దీనితో ఖంగుతిన్న టి. ఎంపీలు తమ సీట్లలోకి వెళ్లి కూర్చున్నారు. టి ఎంపీలు ఆ తరువాత కొద్ది సేపటికి మళ్లీ సోనియా గాంధీ వద్దకు వెళ్లి తమకు డైరెక్షన్ ఇవ్వాలని కోరగా తెలంగాణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నందున ఈ అంశంపై మీరు గొడవ చేయాలనుకుంటే సభ బైట చేయాలి తప్ప లోపల కాదని ఆమె వారికి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సోనియా గాంధీ తమకు చివాట్లు పెట్టారంటూ వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని టి ఎంపీలు తెలిపారు. లోక్‌సభలో తెలంగాణా అంశాన్ని ప్రస్తావించటం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేయద్దని ఆమె తమకు సూచించారని మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్ వివరించారు. ప్రతిపక్షం గొడవ చేస్తూ లోక్‌సభను స్తంభింపజేస్తుంటే అధికార పక్షంలో మీరు కూడా లేచి నిలబడి గొడవ చేస్తే ఎలా అని సోనియా గాంధీ తమను ప్రశ్నించారని వారు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more