యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న మేజర్ చిత్రం కోసం వినూత్నంగా ప్రమోట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందీ అంటారా.. యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం.. సినిమా టికెట్ కోసం ఓ థియేటర్ క్యూలో నిల్చుంటుంది.
అయితే, ఒకరి తర్వాత ఒకరిగా వచ్చిన కొందరు ఆమెకు ముందుగా నిల్చుంటారు. దీంతో అమెకు చిరెత్తుకోస్తోంది. తనలో తానే అర్రెరే ఇలా లైను పాడు లేకుండా వచ్చేస్తే ఎలా అని అనుకుంటున్నంతలో మేజర్ సినిమా హీరో అడవి శేష్ వచ్చి ఆమె ముందు నిల్చుంటాడు. దీంతో నిహారికకు కోపం వచ్చేస్తోంది. దీంతో అతడితో అమె వాగ్వివాదానికి దిగుతుంది. అడవి శేష్ కూడా తానెవరో తెలుసా అంటూ చెబుతుండగా, మరోక వ్యక్తి అమె ముందుకు వచ్చి చేరుతాడు. ఇదిగో ఇప్పుడు మరో వ్యక్తి వచ్చాడు. అంటూ హలో మిస్టర్.. ఇలా లైను మధ్యలోకి వస్తే ఎలా.. అని అడగుతుండగానే ఆ వ్యక్తి వెనక్కు తిరుగుతాడు.
అతడిని చూసిన నిహారిక ఆశ్చర్యపోతుంది. ‘నేను లైను మద్యలోకి వచ్చానా... అంటే లేదు మీరుక్కడుంటే అక్కడి నుంచే లైన్ ప్రారంభమవుతుందని’ నిహారిక చెబుతుంది. దాంతో మహేశ్.. మా స్నేహితులను కూడా పిలవొచ్చా? అని అడగ్గా, అందుకు ఆమె ఓకే అంటుంది. దీంతో లైన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సందర్భంగా మహేశ్ ఫోన్ నంబరు తీసుకోవాలని భావించి అడిగే లోపే అతడు వెళ్లిపోతాడు. అది చూసి నిహారిక అసంతృప్తికి గురవుతుంది. ఆ వెంటనే అడవి శేష్ ఫోన్ నెంబర్ తీసుకుంటోంది. నిహారిక తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో దూసుకుపోతోంది. ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా జూన్ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more