Pawan Kalyan’s Character In Harish Shankar’s Film పవన్ కల్యాణ్ పాత్రపై గబ్బర్ సింగ్ డైరెక్టర్ క్లారిటీ

Pawan kalyan s character in harish shankar s next film revealed

Pawan Kalyan, HariHara Veeramallu, Krishh, Pooja Hedge, Harish Shankar, New Project, Professor role, Lecturer role, Tollywood, Telugu Movies, Entertainment

Telugu director Harish Shankar, who is prepping up to kick-off his highly anticipated movie ‘Bhavadeeyudu Bhagat Singh’ with actor Pawan Kalyan, reveals interesting details. The director of ‘Gabbar Singh’ recently spilled the beans to scribes about Pawan Kalyan’s role in their upcoming film. “Pawan Kalyan is playing a lecturer for the first time,” Harish Shankar said.

పవన్ కల్యాణ్ పాత్రపై గబ్బర్ సింగ్ డైరెక్టర్ క్లారిటీ

Posted: 05/21/2022 12:05 PM IST
Pawan kalyan s character in harish shankar s next film revealed

పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అందాల సందడి చేయనుంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమా తరువాత హరీశ్ శంకర్  దర్శకత్వంలో పవన్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పవన్ ఎలా కనిపించనున్నారు? ఆయనను ఎలా చూపించనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో ఆయన ప్రొఫెసర్ గా కనిపించనున్నారని దర్శకుడు హరీశ్ శంకర్.. పవన్ కల్యాణ్ పాత్రను రివీల్ చేశాడు. అయితే ఇందులో రహస్యమేముందని అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ప్రొఫెసర్ గా కనిపించనున్నాడన్న విషయం ముందే తెలుసు కాబట్టి. అయితే తెలిసినవారి విషయాన్ని పక్కనబెడితే.. పవన్ కల్యాణ్.. ప్రోఫెసర్ అంటూ హరీశ్ శంకర్ క్లారిటీ అంటూ మరికొందరు అభిమానులు తమ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ జోడీని తెరపై చూడటం కోసం .. ' గబ్బర్ సింగ్' కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  HariHara Veeramallu  Krishh  Pooja Hedge  Harish Shankar  New Project  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh