యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపోందిన మరో భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం, రణం, రుధిరం’. సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తలిసిందే. ఈ చిత్రం నుంచి వరుస పెట్టి అప్ డేట్ లు అందుతాయ్ అని రాజమౌళి చెప్పినట్లుగానే వరుసగా అందుతున్న అప్ డేట్లు అటు నందమూరి అభిమానులను.. ఇటు మెగా ఫ్యాన్స్ ను అంబరంలో తేలియాడేలా చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన నాటు నాటు పాట కూడా రికార్డులను నమోదు చేసుకుంది.
ఇక చిత్రబృందం చెప్పినట్లుగానే తాజాగా ఇవాళ విడుదల చేసిన సినిమా ట్రైలర్.. ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉండగా.. చిత్ర ట్రైలర్ తో అవి మరింత ఎత్తుకు పెరిగిపోయాయి. చారిత్రక నేపథ్యంతో ముడిపడిన ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించారు. అయితే నిజమైన చరిత్రకు ఏమాత్రం సంబంధం లేని కథ అని ఇప్పటికే చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇది కేవలం ఊహాజనితమైన కథ అని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన వారి పోస్టర్స్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయి.
తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆంగ్లేయుల అరాచకాలు .. అడవి ప్రజల పట్ల వాళ్ల అమానుష చర్యలు .. వాళ్లని ప్రశ్నించే వీరుడిగా కొమరం భీమ్ కనిపిస్తున్నాడు. ఆంగ్లేయుల తరఫున పోలీస్ అధికారిగా.. కొమరం భీమ్ తరఫున పోరాడే వీరుడిగా రెండు విభిన్నమైన గెటప్పులలో చరణ్ కనిపిస్తుండటం విశేషం. 'తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే .. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే' అంటూ ఎన్టీఆర్ ఆవేశంతో చెప్పిన డైలాగ్, 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి' అంటూ అజయ్ దేవగణ్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. భీమ్ ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలగొడదాం పద.. అంటూ చరణ్ చెప్పిన డైలాగ్.. ఉత్కంఠ రేపుతోంది.
ఇక ట్రైలర్ ప్రారంభంలో భీమ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసేలా రాజీవ్ కనకాల డైలాగ్స్ వున్నాయి. స్కాట్ వర వర్మ అదిలాబాద్ వచ్చినప్పుడు ఓ చిన్న పిల్లను తీసుకువచ్చాడు. మీరు తీసుకువచ్చింది గోండ్ల తెగకు చెందిన పిల్లనండీ.. అయితే వారికేమైనా రెండు కొమ్ములుంటాయా.? అని ప్రశ్న రాగానే.. వారికి ఓ కాపరి ఉంటాడు అని చెప్పడంతో ఆ సీన్ అక్కడికి కట్ అయ్యింది. అదే ఎన్టీఆర్ భీమ్ పాత్రకు ఇంట్రోడక్షన్ గా కనిపిస్తోంది. ఇక చరణ్ బ్రిటీష్ అధికారిగా ఎలివేట్ చేసే సన్నివేశంలో.. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి.. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్. ఇక వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ బాండ్ ను కూడా ట్రైలర్ లో ఒక్క డైలాగ్ తో చూపించాడు దర్శకుడు.
ప్రానం కన్నా ఎక్కువైన నీ సోపతి నా సోంతమన్నా.. గర్వంతో గీ మన్నులో కలిసిపోతనే.. అన్న డైలాగ్ చెప్పకనే వారి స్నేహబంధాన్ని వివరిస్తోంది. ఇక చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయిరా.. అంటే డైలాగ్ వినబడగానే.. చరణ్.. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్ అన్న డైలాగ్.. రాంచరణ్ లో ఏదో మార్పుకు శ్రీకారం చుడుతున్నట్లుగా అనిపిస్తోంది. లవ్ . యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ ట్రైలర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ట్రైలర్ చూసిన అభిమానులు జనవరి 7 ఎప్పుడెప్పుడు వస్తుందా.? అంటూ వేచి చూడటం మొదలైంది.
(And get your daily news straight to your inbox)
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more
May 21 | రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన... Read more
May 21 | పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా... Read more
May 20 | ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా... Read more