Sharwanand’s Maha Samudram Trailer Tops Trends ఆకట్టుకుంటున్న శర్వానంద్ మ‌హాస‌ముద్రం ట్రైల‌ర్

Sharwanand s maha samudram trailer looks intense

Maha Samudram Trailer, Sharwanand,Siddharth, Aditi Rao Hydari, Maha Samudram, Anu Emmauel, Ajay Bhupathi, Anil Sunkara, Tollywood

Young actors Sharwanand and Siddharth are teaming up for an action entertainer. The movie is directed by RX 100 fame Ajay Bhupathi. Maha Samudram is presented as an intense action entertainer and the film is getting ready for Dasara release. The released singles gained enough buzz for the film and the trailer of Maha Samudram is out today.

ఆకట్టుకుంటున్న శర్వానంద్ మ‌హాస‌ముద్రం ట్రైల‌ర్

Posted: 09/24/2021 05:35 PM IST
Sharwanand s maha samudram trailer looks intense

ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం మ‌హాస‌ముద్రం . శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ కాంబినేష‌న్ లో మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న‌ ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హైద‌రి ఫీమేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. స‌ముద్రం చాలా గొప్ప‌ది మామా చాలా ర‌హ‌స్యాలు త‌న‌లోనే దాచుకుంటుంది..అంటూ శ‌ర్వానంద్ చెబుతున్న సంభాష‌ణ‌ల‌తో ట్రైల‌ర్ షురూ అయింది. న‌వ్వుతూ క‌నిపిస్తున్నంత మాత్రాన బాగున్న‌ట్టు కాదు అర్జున్‌.. అంటూ నువ్వు స‌ముద్రం లాంటివాడివి అర్జున్ నీలో క‌ల‌వాల‌ని అన్ని న‌దులు కోరుకుంటాయి..శ‌ర్వానంద్ గురించి హీరోయిన్ చెప్తున్న డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇక్క‌డ మ‌న‌కు న‌చ్చిన‌ట్టు బ‌త‌కాలంటే మ‌న జాత‌కాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి..అని శ‌ర్వానంద్ చెప్పే డైలాగ్స్ మాస్ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మీరు చేస్తే నీతి నేను చేస్తే బూతా అంటూ చివ‌ర‌లో సిద్దార్థ్ చెప్పే సంభాష‌ణ‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. హీరోయిన్ల పాత్ర‌లు బోల్డ్‌గా, అందంగా భిన్న‌మైన షేడ్స్ లో సాగ‌నున్న‌ట్టు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. రాజ్ తోట కెమెరా ప‌నిత‌నం, చేత‌న్ భ‌రద్వాజ్ బీజీఎం, ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువ‌లు సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. రొమాన్స్, యాక్ష‌న్, వినోదం, ఇత‌ర భావోద్వేగాల క‌ల‌యిక‌తో సాగుతున్న ట్రైల‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కు ఏ స్థాయిలో క‌నెక్ట్ అవుతుందో తెలియాలంటే అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh