ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్.. తొలిచిత్రంతోనే తనలోని నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించాడు. నటనాపరంగా అన్నివర్గాల ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి సైతం మంచి మార్కులు కొట్టేశాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొండపాలెం నవల ఆధారంగా తెరకెక్కుతుంది, ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
మేకర్స్ ఈ మూవీని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. గతంలోనే పూర్తి కావాల్సిన ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ పనుల్లో కోవిడ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆలస్యం నెలకొంది. అయితే ఇపుడు ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కావడంతో మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీకి వచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. క్రిష్-వైష్ణవ్ తేజ్ ప్రాజెక్టు విడుదలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ డీ గ్లామరైజ్ డ్ పాత్రలో నటిస్తోంది. డైరెక్టర్ క్రిష్ నల్లమల అటవీ ప్రాంతంలో 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్టుకు కొండపాలెం, జంగిల్ బుక్ టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు టాక్. తొలుత ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలోనే విడుదల చేస్తారని వార్తలు రాగా..ఈ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేసేందుకే మేకర్స్ మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more