Allu Arjun looks rugged as Pushpa in first single ఫుష్ప ఫస్ట్ సింగిల్ తో అల్లుఅర్జున్ ఆల్ టైమ్ రికార్డ్

Allu arjun looks rugged as pushpa in first single daakko daakko meka

Pushpa, Allu Arjun, Rashmika Mandana, sukumar, Mythri movie makers, Devi Sri Prasad, Pushpa Allu Arjun, Pushpa Raj, Rashmika Mandanna, Fahadh Faasil, Daako Daako Meka, First single from Pushpa, Tollywood, movies, Entertainment

The first single from one of the most-anticipated Tollywood movies of the year, Pushpa was unveiled on Friday. Starring Allu Arjun, Rashmika Mandanna and Fahadh Faasil in the lead, Pushpa is helmed by director Sukumar.

ఫుష్ప ఫస్ట్ సింగిల్ తో అల్లుఅర్జున్ ఆల్ టైమ్ రికార్డ్

Posted: 08/13/2021 08:34 PM IST
Allu arjun looks rugged as pushpa in first single daakko daakko meka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' నుంచి విడుదలైన తొలి సింగిల్ అల్ టైమ్ రికార్డును అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. వచ్చే నెలతో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును వదిలారు.

'దాక్కో దాక్కో మేక .. ' అంటూ ఈ పాట కొనసాగుతోంది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శివమ్ ఆలపించాడు. ఈ కథ అడవి నేపథ్యంలో సాగుతుంది .. అందువలన ఆటవిక న్యాయాన్ని గురించి చెబుతూ ఈ పాట నడుస్తుంది. ఈ సాంగ్ లో పుష్పరాజ్ గా బన్నీ గెటప్ - హావభావాలు చాలా కొత్తగా ఉన్నాయి. ఇక తనదైన స్టైల్ లో పూనకం వచ్చిన వాడిలా ఊగుతూ వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. దీనికి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు.దేవిశ్రీ ప్రసాద్ బీట్ తో పాటు, కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇలా ఈ పాటను వదిలారో లేదో అలా దూసుకుపోయింది. 182 నిమిషాల్లోనే 400K లైక్స్ ను సాధించింది. టాలీవుడ్ లో ఇంతవరకూ ఇంత వేగంగా .. ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ ని సాధించిన లిరికల్  వీడియో ఇదేనని చెబుతున్నారు. ఫస్టు సింగిల్ తోనే కొత్త రికార్డును సాధించిందని చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, 'క్రిస్మస్' కు విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pushpa  Allu Arjun  Rashmika Mandana  sukumar  Mythri movie makers  Devi Sri Prasad  Tollywood  

Other Articles