Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ teaser is out ‘సర్కారువారి పాట’ నుంచి బర్త్ డే బ్లాస్టర్

Superstar mahesh babu s sarkaru vaari paata blaster out on his birthday

#HBDMaheshBabu, SarkaruVaariPaata, SarakaruVaariPaataBirthdayBlaster, HappyBirthdayMaheshBabu, MaheshBabu, SuperStarMaheshBabu, KeerthySuresh, ThamanS, Parasuram, MythriMovieMakers, 14ReelsPlus, GMB Entertainment, SarkaruVaariPaataOnJanuary13th, SVPOnJanuary13th, Sankranthi2022, Tollywood, Movies, Entertainment

The makers of Superstar Mahesh Babu’s highly anticipated flick Sarkaru Vaari Paata directed by the Parasuram have released 'Sarkaru Vaari Paata Blaster' at the stroke of midnight on Mahesh Babu's Birthday.

మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారువారి పాట’ నుంచి బ్లాస్టర్

Posted: 08/09/2021 01:34 PM IST
Superstar mahesh babu s sarkaru vaari paata blaster out on his birthday

సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన కథనాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సర్కారువారి పాట' నుంచి చిత్రబృందం ఒక బ్లాస్టర్ ను వదిలింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ రోజున మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి 'బర్త్ డే బ్లాస్టర్' పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అటు ఆట, ఇటు పాట, మరోవైపు కామెడీ, ఇంకోవైపు ఫైటు అన్నింటినీ సమపాళ్లలో ఉంచి నవరసాలను పలికించేవిధంగా చిత్రం రూపోందుతుందని చిత్రయూనిట్ చెప్పకనే చెప్పింది.

అయితే యువ అభిమానులను ఆనందంలో ముంచడం కోసం దుబాయ్ లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి కట్ చేసిన ఫైట్ సీన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ టీజర్ ను వదిలారు. కీర్తి సురేశ్ టీజింగ్ చేస్తూనే రొమాన్స్ .. వెన్నెల కిశోర్ తో కలిసి కామెడీకి సంబంధించిన బిట్స్ ను చూపించారు. దాంతో పరశురామ్ మార్కు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ టీజర్ కలిగిస్తోంది.

ముఖ్యంగా మహేశ్ బాబు కొత్త లుక్ ప్రత్యేక ఆకర్షణగానే చెప్పుకోవాలి. సాధారణంగా లుక్ మార్చడానికి మహేశ్ బాబు పెద్దగా ఆసక్తిని చూపించడు .. అంగీకరించడు. హెయిర్ స్టైల్ విషయంలో మార్పుకు మాత్రమే ఆయన ఓకే చెబుతాడు. అలా కాస్త హెయిర్ స్టైల్ మార్చేసి, ఆయనను మరింత హ్యాండ్సమ్ గా చూపించడంలో పరశురామ్ సక్సెస్ అయ్యాడనే విషయం ఈ టీజర్ బట్టి అర్థమవుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

{youtubev=2cVu7KZxW3c|620|400|1{/youtube}

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MaheshBabu  SarkaruVaariPaata  BirthdayBlaster  KeerthySuresh  ThamanS  Parasuram  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh