Chiranjeevi to launch ‘oxygen banks’ across Telugu states జిల్లాకో ఆక్సిజన్ ఫ్లాంట్: ఫ్యాన్స్ కు మెగాస్టార్ అభయహస్తం..

Chiranjeevi ram charan to launch oxygen banks across telugu states to fight covid 19

Mega star, Mega power star, Chiranjeevi, Ram Charan, Oxygen Banks, telugu states, oxyen supply. oxygen banks, district wise oxygen banks, Telangana, Andhra Pradesh, Tollywood, entertainment, Movies

The short supply of medical oxygen has led to the death of several Covid-19 patients in the second wave of the pandemic. To alleviate the shortage of medical oxygen, Telugu megastar Chiranjeevi and his son Ram Charan will soon launch ‘oxygen banks’ across Telugu states.

జిల్లాకో ఆక్సిజన్ ఫ్లాంట్: ఫ్యాన్స్ కు మెగాస్టార్ అభయహస్తం..

Posted: 05/21/2021 10:24 AM IST
Chiranjeevi ram charan to launch oxygen banks across telugu states to fight covid 19

తనను, తన మోగా కుటుంబం హీరోలను, తెలుగు చిత్రసీమను ఇంతలా ఆదరించి తమను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న రాష్ట్రంలోని ప్రజలకు తాను ఏదైనా చేయాలని అలోచనలో బ్లడ్ బ్యాంక్ ప్రారంబించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత ఐ బ్యాంక్ సహా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు. ఇటీవల కాలం వరకు తాను చేస్తున్న అనేక తెరవెనుక సహాయాలను కూడా మూడో కంటికి తెలియకుండా చేసిన ఆయన కరోనా నేపథ్యంలో గత ఏడాది కరోనా క్రైసెస్ చారిటీ పేరుతో  పేద సినీ కార్మికులకు సాయాన్ని అందించారు. వారికి మూడు నెలలకు సరిపడా సరుకులను అందజేసి వారి ఆదరణ పోందారు.

ఇలా తన సినీ కుటుంబానికి చెందిన వారి బాగోగులు చూస్తున్న ఆయన తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం కూడా ఏదో చేయాలని భావించారు. కరోనా మహమ్మారి రెండోదశ పంజా విసురుతున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతిలో కూడా ఇదే సమస్య కలకలం రేపింది. తిరుపతి రుయా అసుపత్రిలో పలువురు ఆక్సిజన్ కోరత కారణంగానే అసువులు బాసిన ఘటనతో ఆయన చెలించిపోయారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని ఘటనలను వింటూ ఆయన వారిని అదుకునేందుకు ముందుకు కదిలారు.

తనను తన సినీ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలకు తన వంతు సాయంగా ఏదైనా చేయాలని మరీ ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో అనేక మంది మరణిస్తున్నారని తెలిసుకున్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత లేకండా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను ఆయన తనయుడు రాంచరణ్ తో కలసి సంయుక్తంగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పి కరోనా తీవ్ర భాధితులకు అందించాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల్లోగా కార్యకలాపాలు మొదలయ్యేలా ఇప్పటికే పనులు మొదలయ్యాయి. తన సామాజిక స్ఫూర్తితో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించాలని నిర్ణయించారు. అందరికీ వారం రోజుల్లోగా ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles