తనను, తన మోగా కుటుంబం హీరోలను, తెలుగు చిత్రసీమను ఇంతలా ఆదరించి తమను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న రాష్ట్రంలోని ప్రజలకు తాను ఏదైనా చేయాలని అలోచనలో బ్లడ్ బ్యాంక్ ప్రారంబించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత ఐ బ్యాంక్ సహా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు. ఇటీవల కాలం వరకు తాను చేస్తున్న అనేక తెరవెనుక సహాయాలను కూడా మూడో కంటికి తెలియకుండా చేసిన ఆయన కరోనా నేపథ్యంలో గత ఏడాది కరోనా క్రైసెస్ చారిటీ పేరుతో పేద సినీ కార్మికులకు సాయాన్ని అందించారు. వారికి మూడు నెలలకు సరిపడా సరుకులను అందజేసి వారి ఆదరణ పోందారు.
ఇలా తన సినీ కుటుంబానికి చెందిన వారి బాగోగులు చూస్తున్న ఆయన తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం కూడా ఏదో చేయాలని భావించారు. కరోనా మహమ్మారి రెండోదశ పంజా విసురుతున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతిలో కూడా ఇదే సమస్య కలకలం రేపింది. తిరుపతి రుయా అసుపత్రిలో పలువురు ఆక్సిజన్ కోరత కారణంగానే అసువులు బాసిన ఘటనతో ఆయన చెలించిపోయారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని ఘటనలను వింటూ ఆయన వారిని అదుకునేందుకు ముందుకు కదిలారు.
తనను తన సినీ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలకు తన వంతు సాయంగా ఏదైనా చేయాలని మరీ ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో అనేక మంది మరణిస్తున్నారని తెలిసుకున్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత లేకండా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను ఆయన తనయుడు రాంచరణ్ తో కలసి సంయుక్తంగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పి కరోనా తీవ్ర భాధితులకు అందించాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల్లోగా కార్యకలాపాలు మొదలయ్యేలా ఇప్పటికే పనులు మొదలయ్యాయి. తన సామాజిక స్ఫూర్తితో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించాలని నిర్ణయించారు. అందరికీ వారం రోజుల్లోగా ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more