Cherry and Upasana rare throwback pic నెట్టింట్లో అప్పటి మెగా ప్రేమజంట ఫోటో వైరల్..

Ram charan and wife upasana in a rare throwback pic

ram charan, Upasana Kamineni Konidela, Ram Charan Birthday, Cherry-Upasana, throw back, romantic photo, social media, Chiranjeevi, Pratap Reddy, Tollywood, Telugu movies, movies, entertainment

Ram Charan's wife Upasana Kamineni Konidela shared a rare throwback picture on her Instagram profile. In the photograph, Ram Charan can be seen sporting a shirt, denims and a cap while posing with Upasana, who looks pretty in a top and jeans, and a black bullet. Sharing the photo, Upasana Kamineni wrote: "Happy people attract happiness in their lives! I truly believe in this.

నెట్టింట్లో అప్పటి మెగా ప్రేమజంట ఫోటో వైరల్..

Posted: 03/25/2021 09:01 PM IST
Ram charan and wife upasana in a rare throwback pic

మెగాప్రేమజంట అనగానే మీకు సందేహం వచ్చింది కదూ.. ఈ టాపిక్ తప్పకుండా మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్.. ఉపాసన కామినేనిలకు సంబంధించిందే అనుకుంటున్నారు కదూ.. మీ సందేహం కరెక్టే.. ఇంతకీ ఇప్పుడీ టాపిక్ ఎందుకు.. వారికి బంధుమిత్రులు, కుటుంబ పెద్దలు, హితులు, సన్నిహితులందరి సమక్షంలో మూడుమూళ్లు వేసుకుని.. అప్పుడే ఎనిమిదేళ్లు కూడా పూర్తయ్యాయంటే ఎవ్వరైనా నమ్ముతారా. ఇక (2012 జూన్‌ 14లో) మరో ఏడాది రెండు నెలలు పూర్తయితే.. పది వసంతాలను కూడా పూర్తిచేసుకుంటారు. అయితే ఈ నెల 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా తమ పాత జ్ఞాపకాలను పంచుకుంది ఉపాసన.

మెగాస్టార్ చిరంజీవి కోడలుగా, అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగానే కాకుండా తన సామాజిక కార్యక్రమాలలో పాల్గోంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా అపోలో హాస్పిటల్స్ లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ గా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ చురుకుగా వుంటే అమె.. అదే చురుకుదనాన్ని తన సోషల్ మీడియాలోనూ చూపిస్తోంది. తన ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు తనతో పాటు చరణ్ కు సంబంధించిన అంశాలను కూడా పంచుకుంటారు. ఇక వివాహబంధంతో కొణిదేల వారి ఇంటి కోడలైన ఉపాసన.. తన కొణిదెల కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులకు అప్‌డేట్‌ ఇస్తుంటారు.

ఇదే క్రమంలో తాజాగా రామ్ చరణ్ తో దిగిన ఓ ఫోటోను అమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్‌ చేశారు. అయితే ఇది పెళ్లికి ముందు దిగిన ఫోటో కావడం.. అందులో చెర్రీ, ఉపాసన ఇద్దరూ కలిసి ఓ బైక్ దగ్గర నిల్చున్నారు. గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ, 'హ్యాపీ పీపుల్... తమ జీవితాల్లోని హ్యాపీనెస్ పట్ల ఆకర్షితులవుతుంటారు. నేనూ దీనిని పూర్తిగా నమ్ముతాను. త్రోబ్యాక్‌' అంటూ ఫోటోకు కాప్షన్ ఇచ్చారు. ఈ పిక్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. మరో రెండ్రోజుల్లో చరణ్‌ పుట్టిన రోజు ఉండటంతో ఈ పాత ఫోటో మరింతగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో ఎప్పుడు తీసుకున్నారని చాలా క్యూట్‌గా ఉన్నారని కామెంట్‌ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh