టాలీవుడ్ తన పరిధిని విస్తరించుకుంటోంది. కేవలం పెద్ద దర్శకులు, ప్రముఖ హీరోలే కాకుండా విభిన్నమైన కథను అకర్షణీయంగా రూపోందించే సత్తా వున్న దర్శకులు పలువురు ఇప్పుడు పాన్ ఇండియాలను తెరకెక్కిస్తున్నారు. అలాంటి చిత్రాలలో విభిన్న కథాంశంతో.. ప్రముఖ నటి శ్రియా సారెన్, నిత్యామీనన్, శివ కందుకూరి నటిస్తున్న చిత్రం గమనం కూడా ఒకటి. ఈ రోజు మేకర్స్ అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు, సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషరంగా ఆకట్టుకుంటోంది. ఒక నిమిషం కన్నా అధికంగా నిడివి వున్న ఈ ట్రైలర్ లో శ్రియ నటనను దర్ఫణం పట్టేలా వుంది.
ఈ ట్రైలర్ ద్వారా దర్శకుడు చిత్రంలోని ప్రధాన పాత్రల పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇందులో శ్రీయా మగవాడి చేతిలో మోసపోయిన వివాహిత మహిళగా, తన భర్తను వెతుకుతూ నగరానికి చేరుకున్న ఓ బధిర మహిళగా అద్భుతంగా నటించింది, నిత్యా మీనన్‌ను ప్రముఖ సంగీత కళాకారిణి కనిపిస్తోంది. దర్శకుడు విడుదల చేసిన ట్రైలర్లో ఎమోషన్స్, సెంటిమెంట్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంకా జవాల్కర్, సుహాస్, చారుహాసన్, ప్రియా, ఇందు, ఆనంద్, సంజయ్ స్వరూప్, బిత్తిర సత్తి, నిహాంత్, రవి ప్రకాష్, రాజు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సుజన రావు దర్శకత్వం వహించగా, రామేశ్ కారులూరి, వెంకీ పుషాదపులు నిర్మించగా, జ్ఞనశేఖర్ క్రియా ఫిల్మ్ కార్ప్ అండ్ కాళీ ప్రోడక్షన్స్ బ్యానర్లపై నిర్మితం అవుతోంది. పాన్ ఇండియా చిత్రంగా రూపోందుతున్నా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం బాషలలోనూ చిత్రం రూపోందుతుంది. శ్రీయ ఈ చిత్రంతో దర్శక దిగ్గజం రాజమౌళి రూపోందుతున్న ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్లోనూ నటిస్తోంది. అటు తమిళంలో రెండు సినిమాలు మరియు హిందీలో తాడ్కా అనే చిత్రంలోనూ నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more