‘నీ కళ్లు నీలి సముద్రం’, ‘జల జల జలపాతం నువ్వూ’ అంటూ వినసొంపైన పాటలతో సంగీత ప్రేమికులను మంత్ర ముగ్దుల్ని చేసిన చిత్రం ‘ఉప్పెన’. ఆ సినిమా పాటలు ఎంతలా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తేరంగ్రేటం చేస్తుండగా, ఆయన సరసన కన్నడ బ్యూటీ, కృతిశెట్టి నటించారు. ఈ ప్రేమకథా చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు రూపోందిస్తున్నారు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్రబృందం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతులమీదుగా చిత్ర ట్రైయిలర్ ను విడుదల చేసింది. చిత్రంలో పలు డైలాగులు ఆకట్టుకున్నాయి. ప్రేమంటే ఓ లైలా మజ్ఞులా, దేవదాసు పార్వతిలా, రోమియో జూలియట్ లా అదో మాదిరిలా వుండాల్రా.. అంటూ హీరో ప్రేమపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో టీజర్ ప్రారంభమైవుతుంది. అబద్దాలు అడితేనే అడపిల్లలు పుడతారంటే.. మరీ ఇంత అందగత్తె పుట్టిందంటే.. మినిమమ్ వీళ్ల బాబు మర్డర్ ఏమైనా చేసింటాడేంట్రా..? అన్న సందేహం వ్యక్తం చేస్తాడు హీరో.
అక్కడ కట్ చేస్తే అదే డైలాగ్ లో విలన్ కు ఇంట్రోగా మారింది. ఓ యువకుడ్ని చితకగొడుతూ.. కనిపించాడు. ఆ వెంటనే ‘‘నీ కూతురితో పాటు కొడుకును కూడా కన్నావు కదా.. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయాంత్రానికి ఆడు ఇంటికంటుకు వచ్చేస్తాడు’’. ‘‘సముద్రం ఆకాశం కలుస్తాయంటావురా.. అలలు ఎంత ఎగిరిపడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయయ్యా అనే సమాధానం.. మరి ఆకాశం వంగితే..’’ అన్న డైలాగ్ తో పాటు ‘‘ప్రేమంటే పట్టుకోవడం నాన్నా.. వదిలేయడం కాదు..’’ ‘‘ ప్రాయానికి పరువు వేరు ప్రాణం వేరు కాదురా.. రెండు ఒక్కటే..’’ అన్న డైలాగులు ప్రేమ అకట్టకుంటున్నాయి.
‘‘ప్రేమ గోప్పదైతే చరిత్రల్లోనూ సమాదుల్లోనూ కనబడాలి కానీ, పెళ్లిళ్లు చేసుకుని.. పిల్లల్ని కని.. ఇళ్లలో కనబడితే దాని విలువ తగ్గిపోదు.. అందుకే ప్రేమ ఎఫ్పుడు చరిత్రలోనే వుంటది.. దానికి భవిష్యత్తు ఉండదు’’ అన్న డైలాగులు విలన్ పాత్రదారిలోని కర్కషత్వాన్ని చూపుతున్నాయి, సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర బృందానికి వైష్ణవ్ తేజ్ కు ఎన్టీఆర్ అల్ ది బెస్ట్ చెప్పారు. ‘‘ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కోన్నారు. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించారు. గతేడాది విడుదల కావాల్సి ‘ఉప్పెన’ కరోనా కారణంగా ఈ నెల 12న విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more